Nee guttu deliyaraadu nimduga vunnaamdavu

నీ గుట్టు దెలియరాదు నిండుక వున్నాఁడవు
Language

(॥పల్లవి॥)
నీ గుట్టు దెలియరాదు నిండుక వున్నాఁడవు
యే గతి నీ సేవ సేతు మెఱిఁగించవయ్యా

(॥నీగు॥)
చెక్కులపైఁ జెమటలు జిగిమించి వూరఁ జొచ్చె
యెక్కడఁ దలఁచితవో యెఱఁగ నేను
చక్కని నీ కెమ్మోని జడియుచు వసివాడె
పెక్కుమాట లెవ్వతెతో బెఱసి యాడితివో

(॥నీగు॥)
నిలువెల్లాఁ బరాకులె నెయ్యమునఁ గానుపించె
వల పెందునున్నదో నీవైపు దెలియ
తిలకింప నీ కన్నులతేటలలో కెంపు మీరె
తలఁక కెవ్వతెదిక్కు తప్పక చూచితివో

(॥నీగు॥)
సిగ్గులు మోమున ముంచి సెలవుల నవ్వు దేరె
వొగ్గి యెవ్వతెఁ గూడితివో ఇదెంచను
యెగ్గులేక శ్రీవేంకటేశ మమ్ము నేలితివి
కగ్గుదేరె నెటువంటికతలు నేర్చితివో

(||pallavi||)
nī guṭṭu dĕliyarādu niṁḍuga vunnām̐ḍavu
ye gadi nī seva sedu mĕṟim̐giṁchavayyā

(||nīgu||)
sĕkkulabaim̐ jĕmaḍalu jigimiṁchi vūram̐ jŏchchĕ
yĕkkaḍam̐ dalam̐sidavo yĕṟam̐ga nenu
sakkani nī kĕmmoni jaḍiyusu vasivāḍĕ
pĕkkumāḍa lĕvvadĕdo bĕṟasi yāḍidivo

(||nīgu||)
niluvĕllām̐ barāgulĕ nĕyyamunam̐ gānubiṁchĕ
vala pĕṁdununnado nīvaibu dĕliya
tilagiṁpa nī kannuladeḍalalo kĕṁpu mīrĕ
talam̐ka kĕvvadĕdikku tappaga sūsidivo

(||nīgu||)
siggulu momuna muṁchi sĕlavula navvu derĕ
vŏggi yĕvvadĕm̐ gūḍidivo idĕṁchanu
yĕggulega śhrīveṁkaḍeśha mammu nelidivi
kagguderĕ nĕḍuvaṁṭigadalu nersidivo