నీ గుణము చక్కనాయ నిజమా యిది
(॥పల్లవి॥)
నీ గుణము చక్కనాయ నిజమా యిది
వేగినంతా నిందులకు వెరగయ్యీ నాకు
(॥నీగు॥)
అక్కడనుండి నాపై ఆసల నీవు కడు
నిక్కి చూచితివి యట నిజమా యిది
యెక్కడ నేరుచుకొంటి వెవ్వరు బుద్దిచెప్పిరి
వెక్కసముగా నేఁడు వెరగయ్యీనాకు
(॥నీగు॥)
భావించి నే నున్నందుకు పంతములు నీ విచ్చితి
నీవు నన్ను మెచ్చితట నిజమా యిది
సేవ లెట్టు చేకొంటివి చిత్త మెటువలె వచ్చె
వేవేలుచందములను వెరగయ్యీ నాకు
(॥నీకు॥)
తలపోఁత కాఁగిలితగులాయముల నిట్టె
నెలకొంటి వన్నిటాను నిజమా యిది
కలసితి విదె శ్రీ వేంకటేశ యేకారణమో
వెలయ యీకరుణకే వెరగయ్యీ నాకు
(||pallavi||)
nī guṇamu sakkanāya nijamā yidi
veginaṁtā niṁdulagu vĕragayyī nāgu
(||nīgu||)
akkaḍanuṁḍi nābai āsala nīvu kaḍu
nikki sūsidivi yaḍa nijamā yidi
yĕkkaḍa nerusugŏṁṭi vĕvvaru buddisĕppiri
vĕkkasamugā nem̐ḍu vĕragayyīnāgu
(||nīgu||)
bhāviṁchi ne nunnaṁdugu paṁtamulu nī vichchidi
nīvu nannu mĕchchidaḍa nijamā yidi
seva lĕṭṭu segŏṁṭivi sitta mĕḍuvalĕ vachchĕ
vevelusaṁdamulanu vĕragayyī nāgu
(||nīgu||)
talabom̐ta kām̐gilidagulāyamula niṭṭĕ
nĕlagŏṁṭi vanniḍānu nijamā yidi
kalasidi vidĕ śhrī veṁkaḍeśha yegāraṇamo
vĕlaya yīgaruṇage vĕragayyī nāgu