Nee gunamamtayum dolli ne nerumgudu

నీ గుణమంతయుఁ దొల్లి నే నెరుఁగుదు
Language

(॥పల్లవి॥)
నీ గుణమంతయుఁ దొల్లి నే నెరుఁగుదు
చేగదేరె వలపులు చెప్పకుమీ సుద్దులు

(॥నీగు॥)
చనవరి గనక యీసతి జాణతనాలాడీ
వినరాదా ఇపుడు నీ వీనులారను
పనిమాలిన పరాకు పచారించే విదియేల
వనితల ముందరను వద్దు సుమ్మీ యెమ్మెలు

(॥నీగు॥)
పెండిలాడెఁగనక ముప్పిరి గొనఁ బొలసీని
దండఁబెట్టుకొనరాదా తమితోడను
మెండుకొన్న గర్వము మెరఇంచ నిఁకనేల
పండెను నీ మనసిదే పట్టకుమీ యెగ్గులు

(॥నీగు॥)
పట్టపుదేవి గనక పైకొని నిన్నుఁ గూడీ
గుట్టుతో నేలుకోరాదా కొంకుదేరను
నెట్టన శ్రీ వేంకటేశ నేరుపులు దాఁచనేల
దట్టమాయఁ గోరికలు తప్పకుమీబాసలు

(||pallavi||)
nī guṇamaṁtayum̐ dŏlli ne nĕrum̐gudu
segaderĕ valabulu sĕppagumī suddulu

(||nīgu||)
sanavari ganaga yīsadi jāṇadanālāḍī
vinarādā ibuḍu nī vīnulāranu
panimālina parāgu pasāriṁche vidiyela
vanidala muṁdaranu vaddu summī yĕmmĕlu

(||nīgu||)
pĕṁḍilāḍĕm̐ganaga muppiri gŏnam̐ bŏlasīni
daṁḍam̐bĕṭṭugŏnarādā tamidoḍanu
mĕṁḍugŏnna garvamu mĕra̮iṁcha nim̐kanela
paṁḍĕnu nī manaside paṭṭagumī yĕggulu

(||nīgu||)
paṭṭabudevi ganaga paigŏni ninnum̐ gūḍī
guṭṭudo nelugorādā kŏṁkuderanu
nĕṭṭana śhrī veṁkaḍeśha nerubulu dām̐sanela
daṭṭamāyam̐ gorigalu tappagumībāsalu