నీ గుణ మిటువంటిదా నిన్నా మొన్నాను
(॥పల్లవి॥)
నీ గుణ మిటువంటిదా నిన్నా మొన్నాను
ఆగడానఁ బడి వచ్చి అనేవు గాక
(॥॥)
యెగసక్కె మేదయ్య యింతులము నీతో
నగరాదా నీవే చనవు లియ్యఁగా
మగిడి యెవ్వతోచేత మాటఁ బడిన కోపాన
పగటు బీరము మాపైఁ జూపేవు గాక
(॥॥)
గబ్బితన మేదయ్య కాలు నీవు దొక్కఁగాను
దొబ్బరాదా నొచ్చీ నంటాఁ దొలఁగు మని
గుబ్బున నెవ్వతో నిన్నుఁ గూడని వుడుకునను
గుబ్బలో త్తెనని నీవు గుంపించేవు గాక
(॥॥)
వుద్దండ మిందేదయ్య వూరకే కస్తూరి బొట్టు
తిద్దరాదా జారఁ జెక్కుటద్దాల వెంట
గద్దించి నన్నేలి శ్రీవేంకటేశ యెవ్వతోకంటెఁ
బెద్దరికానకు నాతో బిగిసేవు గాక
(||pallavi||)
nī guṇa miḍuvaṁṭidā ninnā mŏnnānu
āgaḍānam̐ baḍi vachchi anevu gāga
(||||)
yĕgasakkĕ medayya yiṁtulamu nīdo
nagarādā nīve sanavu liyyam̐gā
magiḍi yĕvvadoseda māḍam̐ baḍina kobāna
pagaḍu bīramu mābaim̐ jūbevu gāga
(||||)
gabbidana medayya kālu nīvu dŏkkam̐gānu
dŏbbarādā nŏchchī naṁṭām̐ dŏlam̐gu mani
gubbuna nĕvvado ninnum̐ gūḍani vuḍugunanu
gubbalo ttĕnani nīvu guṁpiṁchevu gāga
(||||)
vuddaṁḍa miṁdedayya vūrage kastūri bŏṭṭu
tiddarādā jāram̐ jĕkkuḍaddāla vĕṁṭa
gaddiṁchi nanneli śhrīveṁkaḍeśha yĕvvadogaṁṭĕm̐
bĕddarigānagu nādo bigisevu gāga