Nee guna meṟimgenamtaa ne numdaananu

నీ గుణ మెఱిఁగేనంటా నే నుందానను
Language

(॥పల్లవి॥)
నీ గుణ మెఱిఁగేనంటా నే నుందానను
యీ గతి నూరకుండితే యెగ్గులు సేయకుమీ

(॥నీగు॥)
మనసు వేరొకతెపై మరిగి నీ కుండఁగాను
పెనఁగఁగఁబోతేను ప్రియము గాదు
పనివడి చూపు లాపెపైఁ బారివుండఁగాను
వినుకొలువు సేసితే వేసటలై వుండవా

(॥నీగు॥)
తేరకొని నీ వొకదిక్కున నవ్వఁగాను
చేరి యంతమొక్కినాను సెలవయ్యీనా
కోరి పరాకున నాముకొని తలపోయఁగాను
సారె నిన్నుఁ బిలిచితే సందడిలో వినేవా

(॥నీగు॥)
సూటిగా నీ వవ్వలిసుద్దులెల్లా వినఁగాను
మేటినాసరసములు మెచ్చులయ్యీనా
చోటిచ్చి నన్నేలితివి చొక్కుచు శ్రీవేంకటేశ
వాటముగా నిఁకను నీవలపు లీడేరవా

(||pallavi||)
nī guṇa mĕṟim̐genaṁṭā ne nuṁdānanu
yī gadi nūraguṁḍide yĕggulu seyagumī

(||nīgu||)
manasu verŏgadĕbai marigi nī kuṁḍam̐gānu
pĕnam̐gam̐gam̐bodenu priyamu gādu
panivaḍi sūbu lābĕbaim̐ bārivuṁḍam̐gānu
vinugŏluvu seside vesaḍalai vuṁḍavā

(||nīgu||)
teragŏni nī vŏgadikkuna navvam̐gānu
seri yaṁtamŏkkinānu sĕlavayyīnā
kori parāguna nāmugŏni talaboyam̐gānu
sārĕ ninnum̐ biliside saṁdaḍilo vinevā

(||nīgu||)
sūḍigā nī vavvalisuddulĕllā vinam̐gānu
meḍināsarasamulu mĕchchulayyīnā
soḍichchi nannelidivi sŏkkusu śhrīveṁkaḍeśha
vāḍamugā nim̐kanu nīvalabu līḍeravā