నీ దిక్కే తప్పక చూచీ నీ విభుఁడు
(॥పల్లవి॥)
నీ దిక్కే తప్పక చూచీ నీ విభుఁడు
మోదముతోఁ జేతు లెత్తి మొక్కు మొక్కఁ గదవే
(॥॥)
బాసికము గట్టు కొని పదరఁగ నేఁటికి
సేసలు చల్లే అప్పుడు సిగ్గు లింకానా
ఆసతోఁ బెనఁగుతాను అనుమానము దగునా
వేసరని వలపుల విఱ్ఱవీఁగ గదవే
(॥॥)
వీడెము చే నందుకొని వింత సేయవలెనా
కూడిమాడి వుండి మరి గుట్టు సేతురా
వాడికగాఁ బొందుసేసి వావు లడుగుదురా
జోడు గూడి కౌగిటిలో సొంపు మీఱఁగదవే
(॥॥)
మంతనాన దక్కగొని మరగు వెదకుదురా
పంతము లీడేరె మరి కొసరేలా
చెంత నలమేల్మంగవు శ్రీ వేంకటేశుఁడతఁడు
సంతోసించి నిన్ను నేలే జట్టి గొనగదవే
(||pallavi||)
nī dikke tappaga sūsī nī vibhum̐ḍu
modamudom̐ jedu lĕtti mŏkku mŏkkam̐ gadave
(||||)
bāsigamu gaṭṭu kŏni padaram̐ga nem̐ṭigi
sesalu salle appuḍu siggu liṁkānā
āsadom̐ bĕnam̐gudānu anumānamu dagunā
vesarani valabula viṭravīm̐ga gadave
(||||)
vīḍĕmu se naṁdugŏni viṁta seyavalĕnā
kūḍimāḍi vuṁḍi mari guṭṭu sedurā
vāḍigagām̐ bŏṁdusesi vāvu laḍugudurā
joḍu gūḍi kaugiḍilo sŏṁpu mīṟam̐gadave
(||||)
maṁtanāna dakkagŏni maragu vĕdagudurā
paṁtamu līḍerĕ mari kŏsarelā
sĕṁta nalamelmaṁgavu śhrī veṁkaḍeśhum̐ḍadam̐ḍu
saṁtosiṁchi ninnu nele jaṭṭi gŏnagadave