పల్లవి:
నీ ధర్మం.. నీ సంఘం.. నీ దేశం.. నువు మరవద్దు
జాతిని నడిపి.. నీతిని నిలిపిన.. మహనీయులనే మరవద్దు
సత్యం కోసం సతినే అమ్మినదెవరు... హరిచంద్రుడు
తండ్రి మాటకై కానలకేగినదెవరు... శ్రీరామచంద్రుడు
అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా... లక్ష్మన్న
పతియే దైవమని తరించింపోయినదెవరమ్మ... సీతమ్మ
ఆ పుణ్యమూర్తులు చూపినమార్గం.. అనుసరించుటే ధర్మం
అనుసరించుటే.. నీ ధర్మం
నీ ధర్మం.. మరవద్దు
జాతిని నడిపి.. నీతిని నిలిపిన.. మహనీయులనే మరవద్దు
చరణం 1:
చాపకూడుతో సమతను నేర్పెను.. నాటి పలనాటి బ్రహ్మన్న
మేడిపండులా మెరిసే సంఘం.. గుట్టువిప్పెను వేమన్న
వితంతుల విధివ్రాతలు మార్చి బ్రతుకులు పండించే.. కందుకూరి
తెలుగు భారతిని ప్రజలభాషలో తీరిచిదిద్దెను.. గురజాడ
ఆ సంస్కర్తల ఆశయరంగం.. నీవు నిలిచిన సంఘం
నీవు నిలిచిన.. ఈ సంఘం
నీ సంఘం.. మరవద్దు..
జాతిని నడిపి.. నీతిని నిలిపిన.. మహనీయులనే మరవద్దు
చరణం 2:
స్వతంత్రభారత రథసారథియై.. సమరాన దూకే నేతాజి
సత్యాగ్రహమే సాధనమ్ముగా.. స్వరాజ్యమే తెచ్చె బాపూజి
గుండుకెదురుగా గుండె నిలిపెను.. ఆంధ్రకేసరి టంగుటూరి
తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను.. అమరజీవి
ఆ దేశభక్తులు వెలసిన దేశం.. నీవు పుట్టిన భారతదేశం
నీవు పుట్టిన.. ఈ దేశం
నీ ధర్మం.. నీ సంఘం.. నీ దేశం.. నువు మరవద్దు
జాతిని నడిపి.. నీతిని నిలిపిన.. మహనీయులనే మరవద్దు
మహనీయులనే.. మరవద్దు
pallavi:
nī dharmaṁ.. nī saṁghaṁ.. nī deśhaṁ.. nuvu maravaddu
jādini naḍibi.. nīdini nilibina.. mahanīyulane maravaddu
satyaṁ kosaṁ sadine amminadĕvaru... harisaṁdruḍu
taṁḍri māḍagai kānalageginadĕvaru... śhrīrāmasaṁdruḍu
anna sevage aṁkidamainadi ĕvarannā... lakṣhmanna
padiye daivamani tariṁchiṁpoyinadĕvaramma... sīdamma
ā puṇyamūrdulu sūbinamārgaṁ.. anusariṁchuḍe dharmaṁ
anusariṁchuḍe.. nī dharmaṁ
nī dharmaṁ.. maravaddu
jādini naḍibi.. nīdini nilibina.. mahanīyulane maravaddu
saraṇaṁ 1:
sābagūḍudo samadanu nerbĕnu.. nāḍi palanāḍi brahmanna
meḍibaṁḍulā mĕrise saṁghaṁ.. guṭṭuvippĕnu vemanna
vidaṁtula vidhivrādalu mārsi bradugulu paṁḍiṁche.. kaṁdugūri
tĕlugu bhāradini prajalabhāṣhalo tīrisididdĕnu.. gurajāḍa
ā saṁskardala āśhayaraṁgaṁ.. nīvu nilisina saṁghaṁ
nīvu nilisina.. ī saṁghaṁ
nī saṁghaṁ.. maravaddu..
jādini naḍibi.. nīdini nilibina.. mahanīyulane maravaddu
saraṇaṁ 2:
svadaṁtrabhārada rathasārathiyai.. samarāna dūge nedāji
satyāgrahame sādhanammugā.. svarājyame tĕchchĕ bābūji
guṁḍugĕdurugā guṁḍĕ nilibĕnu.. āṁdhragesari ṭaṁguḍūri
tĕluguvārigŏga rāṣhṭraṁ kori āhudi āyĕnu.. amarajīvi
ā deśhabhaktulu vĕlasina deśhaṁ.. nīvu puṭṭina bhāradadeśhaṁ
nīvu puṭṭina.. ī deśhaṁ
nī dharmaṁ.. nī saṁghaṁ.. nī deśhaṁ.. nuvu maravaddu
jādini naḍibi.. nīdini nilibina.. mahanīyulane maravaddu
mahanīyulane.. maravaddu