Nee devula gunamu neeve yeṟumguduvu

నీ దేవుల గుణము నీవే యెఱుఁగుదువు
Language

(॥పల్లవి॥)
నీ దేవుల గుణము నీవే యెఱుఁగుదువు
పోదితో నిప్పుడే వారి బుజ్జగించుకొనుమీ

(॥॥)
కాంత వూడిగపు వారిఁ గై కొనక నీ వుండితే
నంతయు వారు చెప్పఁగా నాకె నిన్నేమనునో
చెంత నున్నచెలులము చేరి నీకుఁ జెప్పితిమి
వింతగా మీఁ దటి యెత్తు విచారించుకొనుమీ

(॥॥)
లలన కడ దారిని లాలించకుండితే వారు
కలవి లేనివి నంటే కలికి చిత్త మెట్టో
తెలిసిన వారము తలఁపించితిమి నీకు
యెలమిఁ దగవు నీవే యెంచుకొనుమీ

(॥॥)
అలమేలుమంగ దూతికల మన్నించకుండితే
చల మెక్కించితే నింతిచంద మేరీ తౌనో
యెలమి శ్రీ వేంకటేశ యీకె నీవుఁ గూడితివి
లలి నెచ్చరించితిమి చెలిమే నెరపుమీ

(||pallavi||)
nī devula guṇamu nīve yĕṟum̐guduvu
podido nippuḍe vāri bujjagiṁchugŏnumī

(||||)
kāṁta vūḍigabu vārim̐ gai kŏnaga nī vuṁḍide
naṁtayu vāru sĕppam̐gā nāgĕ ninnemanuno
sĕṁta nunnasĕlulamu seri nīgum̐ jĕppidimi
viṁtagā mīm̐ daḍi yĕttu visāriṁchugŏnumī

(||||)
lalana kaḍa dārini lāliṁchaguṁḍide vāru
kalavi lenivi naṁṭe kaligi sitta mĕṭṭo
tĕlisina vāramu talam̐piṁchidimi nīgu
yĕlamim̐ dagavu nīve yĕṁchugŏnumī

(||||)
alamelumaṁga dūdigala manniṁchaguṁḍide
sala mĕkkiṁchide niṁtisaṁda merī tauno
yĕlami śhrī veṁkaḍeśha yīgĕ nīvum̐ gūḍidivi
lali nĕchchariṁchidimi sĕlime nĕrabumī