నీ దయాధర్మమునకు నీ చిత్తమిఁక
(॥పల్లవి॥)
నీ దయాధర్మమునకు నీ చిత్తమిఁక
యీ దెస మా నేర్చు లిఁక యెంచఁగలదా
(॥నీద॥)
యీవల నా యపరాథ మెఱుకతో నీకుఁ జేసి
గావు మని మిమ్మన సంగతులా నాకు
కైవసమై నీకు వేళ గాచి యుండి కొలువక
సేవించ చేయెత్తి మొక్క సిగ్ను గాదా నాకు
(॥నీద॥)
మన్నించిన నీ మన్నన మఱచి మత్తుఁడనై
యిన్నిటా నీవాఁడ నంటే యే మందువో
యెన్నిక ద్రోహినై యిప్పుడిచ్చకాలు సేయఁబోతే
నన్నుఁ జూచి పరులెల్లా నవ్వరా యింకాను
(॥నీద॥)
కొంత సంసారభక్తితో కోరి నీ భక్తుఁడనైతి
వంతుల విజ్ఞాన మెటువలె నుండునో
యింతట శ్రీ వేంకటేశ యిట్టె నన్ను రక్షించితి
వంతర్యామివి నీవు అది నా విన్నపము
(||pallavi||)
nī dayādharmamunagu nī sittamim̐ka
yī dĕsa mā nersu lim̐ka yĕṁcham̐galadā
(||nīda||)
yīvala nā yabarātha mĕṟugado nīgum̐ jesi
gāvu mani mimmana saṁgadulā nāgu
kaivasamai nīgu veḽa gāsi yuṁḍi kŏluvaga
seviṁcha seyĕtti mŏkka signu gādā nāgu
(||nīda||)
manniṁchina nī mannana maṟasi mattum̐ḍanai
yinniḍā nīvām̐ḍa naṁṭe ye maṁduvo
yĕnniga drohinai yippuḍichchagālu seyam̐bode
nannum̐ jūsi parulĕllā navvarā yiṁkānu
(||nīda||)
kŏṁta saṁsārabhaktido kori nī bhaktum̐ḍanaidi
vaṁtula vijñāna mĕḍuvalĕ nuṁḍuno
yiṁtaḍa śhrī veṁkaḍeśha yiṭṭĕ nannu rakṣhiṁchidi
vaṁtaryāmivi nīvu adi nā vinnabamu