నీ దాసులపంచ నీడ నుండితేఁ జాలు
(॥పల్లవి॥)
నీ దాసులపంచ నీడ నుండితేఁ జాలు
ఆదినారాయణ నాకు నదియె పో వ్రతము
(॥నీదా॥)
హరి నిన్నుఁ బాసినట్టి యమరేంద్రలోక మొల్ల
గరిమ నీవు గూడని కర్మము నొల్ల
పరగ నీ నుతిలేని పలుచదువులు నొల్ల
హరి నీ కథ వినని సభ చొర నొల్ల
(॥నీదా॥)
దేవ నీ దాస్యములేని దేవసంభాషణ యొల్ల
భావించి నీకు మొక్కని ఫలము నొల్ల
ఆవల నీ వారగించని యమృతపానము నొల్ల
శ్రీవిభుఁడ నీవులేని చింత నే నొల్ల
(॥నీదా॥)
అంది నీ సేవ సేయని యగ్రజన్మమైన నొల్ల
పొంది నీ కొప్పనగాని భోగము నొల్ల
యిందునే శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె
అందితి జీవన్ముక్తి యావ లేమి నొల్లా
(||pallavi||)
nī dāsulabaṁcha nīḍa nuṁḍidem̐ jālu
ādinārāyaṇa nāgu nadiyĕ po vradamu
(||nīdā||)
hari ninnum̐ bāsinaṭṭi yamareṁdraloga mŏlla
garima nīvu gūḍani karmamu nŏlla
paraga nī nudileni palusaduvulu nŏlla
hari nī katha vinani sabha sŏra nŏlla
(||nīdā||)
deva nī dāsyamuleni devasaṁbhāṣhaṇa yŏlla
bhāviṁchi nīgu mŏkkani phalamu nŏlla
āvala nī vāragiṁchani yamṛtabānamu nŏlla
śhrīvibhum̐ḍa nīvuleni siṁta ne nŏlla
(||nīdā||)
aṁdi nī seva seyani yagrajanmamaina nŏlla
pŏṁdi nī kŏppanagāni bhogamu nŏlla
yiṁdune śhrīveṁkaḍeśha yelidivi mammu niṭṭĕ
aṁdidi jīvanmukti yāva lemi nŏllā