నీ బలిమి నా బలిమి నేఁడే కానఁగవచ్చీ
(॥పల్లవి॥)
నీ బలిమి నా బలిమి నేఁడే కానఁగవచ్చీ
జూబుల??? పచారాల జూటుఁదనా లేఁటీకే
(॥నీబ॥)
యేతు లేమి చెప్పేవే యిందరిముందరా నీవు
ఆతఁడు నీతో సరసమాడు నంటాను
యీతల నీ పతిని యా యింటికిఁ దెచ్చుకోఁగాను
చూతము నీ సలిగెలు చూపఁగరాదా
(॥నీబ॥)
కేరుతా నేమి నవ్వేనే కీలుగంటు జారఁగాను
చేరి నీ మగఁడు బత్తిసేసీ నంటాను
గారవించి నే నీతనిఁ గాఁగిట బిగించఁగాను
ఆరితేరి నీ వప్పుడు ఔఁ గాదనఁగలవా
(॥నీబ॥)
నీ వెంత విఱ్ఱవీఁగేవే నీటులు మెరసుకొంటా
శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ జెందెనంటాను
యీవేళ నన్నీతఁడేలె యిట్టె నే బాయకుండితే
మా వలపు దెలుసుక మరి మెచ్చఁగదవే
(||pallavi||)
nī balimi nā balimi nem̐ḍe kānam̐gavachchī
jūbula??? pasārāla jūḍum̐danā lem̐ṭīge
(||nība||)
yedu lemi sĕppeve yiṁdarimuṁdarā nīvu
ādam̐ḍu nīdo sarasamāḍu naṁṭānu
yīdala nī padini yā yiṁṭigim̐ dĕchchugom̐gānu
sūdamu nī saligĕlu sūbam̐garādā
(||nība||)
kerudā nemi navvene kīlugaṁṭu jāram̐gānu
seri nī magam̐ḍu battisesī naṁṭānu
gāraviṁchi ne nīdanim̐ gām̐giḍa bigiṁcham̐gānu
ārideri nī vappuḍu aum̐ gādanam̐galavā
(||nība||)
nī vĕṁta viṭravīm̐geve nīḍulu mĕrasugŏṁṭā
śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ jĕṁdĕnaṁṭānu
yīveḽa nannīdam̐ḍelĕ yiṭṭĕ ne bāyaguṁḍide
mā valabu dĕlusuga mari mĕchcham̐gadave