Nedane telusuno neesamdamu maagu

నేటనే తెలుసునో నీచందము మాకు
Language

(॥పల్లవి॥)
నేటనే తెలుసునో నీచందము మాకు
నాటివారు గాన రైరి నవ్వుల నీచందము

(॥నేటనే॥)
సరుగ నావులఁ గాచేచంద మేఁటిచందము నీవు
తిరిగి గోవర్ధన మెత్తిన దేఁటిచందము
సరి రోల గట్టువడ్డచంద మేఁటిచందము అట్టె
తొరలి మద్దులు గూలదొబ్బిన దేచందము

(॥నేటనే॥)
జాతిగొల్లవాఁడవైనచంద మేఁటిచందము ని
న్నీతల బ్రహ్మ నుతియించిన దేటిచందము
జాతకపు పసిబాలచంద మేఁటిచందము అట్టే
బూతకిఁ జంపిన నీపొందు లేటిచందము

(॥నేటనే॥)
తచ్చన గోపికలన్న తగులు నీ చందము
మెచ్చుల శ్రీవేంకటేశ మెఱసె నీ చందము
రచ్చల ద్వారకలోన రాజవైనచందమూ నేఁడు
యిచ్చల దేవుఁడవయిన యెక్కుడు నీ చందమూ

(||pallavi||)
neḍane tĕlusuno nīsaṁdamu māgu
nāḍivāru gāna rairi navvula nīsaṁdamu

(||neḍane||)
saruga nāvulam̐ gāsesaṁda mem̐ṭisaṁdamu nīvu
tirigi govardhana mĕttina dem̐ṭisaṁdamu
sari rola gaṭṭuvaḍḍasaṁda mem̐ṭisaṁdamu aṭṭĕ
tŏrali maddulu gūladŏbbina desaṁdamu

(||neḍane||)
jādigŏllavām̐ḍavainasaṁda mem̐ṭisaṁdamu ni
nnīdala brahma nudiyiṁchina deḍisaṁdamu
jādagabu pasibālasaṁda mem̐ṭisaṁdamu aṭṭe
būdagim̐ jaṁpina nībŏṁdu leḍisaṁdamu

(||neḍane||)
tachchana gobigalanna tagulu nī saṁdamu
mĕchchula śhrīveṁkaḍeśha mĕṟasĕ nī saṁdamu
rachchala dvāragalona rājavainasaṁdamū nem̐ḍu
yichchala devum̐ḍavayina yĕkkuḍu nī saṁdamū