Nedam gaagumdide rebe neriseem gaaga

నేటఁ గాకుండితే రేపే నేరిచీఁ గాక
Language

(॥పల్లవి॥)
నేటఁ గాకుండితే రేపే నేరిచీఁ గాక
తేటకన్నులకుఁ గెంపు దెచ్చుకోఁ గలనా

(॥నేటఁ॥)
కానీకానీవే కన్నుల నవ్వీఁ దాను
పైనే, విచ్చినమేడిపంటిబోనము
దానికేమి యింతలోనె తాఁ జేసినందుకెల్ల
తేనెవంటి పెదవుల తెగనాడఁగలనా

(॥నేటఁ॥)
కాదంటేఁ బోదుగదే కాఁకలురేఁచీఁ దాను
పోది సేయనేల లక్కపూసకపులు
వాదులేల తా నన్ను వలెనని పట్టఁగాను
యీదెల మెత్తనిచేత నిఁకఁ దోసేనా

(॥నేటఁ॥)
ఆయనాయ నందుకేమి ఆరడిఁబెట్టీఁ దాను
యేయెడ నెక్కినవాని కేనిగె గుజ్జే
ఆయపు శ్రీ వేంకటాద్రి నదె వావిలిపాటను
పాయపురాముఁడు గూడె పంతమాడేనా

(||pallavi||)
neḍam̐ gāguṁḍide rebe nerisīm̐ gāga
teḍagannulagum̐ gĕṁpu dĕchchugom̐ galanā

(||neḍam̐||)
kānīgānīve kannula navvīm̐ dānu
paine, vichchinameḍibaṁṭibonamu
dānigemi yiṁtalonĕ tām̐ jesinaṁdugĕlla
tenĕvaṁṭi pĕdavula tĕganāḍam̐galanā

(||neḍam̐||)
kādaṁṭem̐ bodugade kām̐kalurem̐sīm̐ dānu
podi seyanela lakkabūsagabulu
vādulela tā nannu valĕnani paṭṭam̐gānu
yīdĕla mĕttaniseda nim̐kam̐ dosenā

(||neḍam̐||)
āyanāya naṁdugemi āraḍim̐bĕṭṭīm̐ dānu
yeyĕḍa nĕkkinavāni kenigĕ gujje
āyabu śhrī veṁkaḍādri nadĕ vāvilibāḍanu
pāyaburāmum̐ḍu gūḍĕ paṁtamāḍenā