Ne vinnavimche demi neeve yeṟumguda gaaga

నే విన్నవించే దేమి నీవే యెఱుఁగుట గాక
Language

(॥పల్లవి॥)
నే విన్నవించే దేమి నీవే యెఱుఁగుట గాక
శ్రీవల్లభుఁడవు దయసేయవే నామీఁదను

(॥నేవిన్న॥)
తన మలిన మద్దము తాఁ దోముకొనునా
కనుఁగొనేటి యద్దము గలవాఁడు దోముఁ గాక
పనివడి నా దోషములు పాపుకొన శక్తుఁడనా
విను నాలో నుండిన నీవే పాపుట గాకా

(॥నేవిన్న॥)
మహి వెఱ్ఱివాఁడు వెఱ్ఱి మాన మందు తాఁ గొనునా
వహి కెక్క మం దిచ్చేటి వైద్యుఁడు మానుపుఁ గాక
బహుచంచలుఁడను నా భక్తి నీపైఁ బెట్టేనా
మహిమచేతను నీవే మరపుట గాకా

(॥నేవిన్న॥)
ధరలోనఁ బెట్టు జెట్టు తా నీరు వోసుకొనునా
బొరిఁ బెంచేవాఁడు నీరు వోసి పెంచుఁ గాక
నిరతి శ్రీవేంకటేశ నేనే నన్ను బోషించేనా
హరి నీవు వుట్టించితి నటు రక్షింతు గాకా

(||pallavi||)
ne vinnaviṁche demi nīve yĕṟum̐guḍa gāga
śhrīvallabhum̐ḍavu dayaseyave nāmīm̐danu

(||nevinna||)
tana malina maddamu tām̐ domugŏnunā
kanum̐gŏneḍi yaddamu galavām̐ḍu domum̐ gāga
panivaḍi nā doṣhamulu pābugŏna śhaktum̐ḍanā
vinu nālo nuṁḍina nīve pābuḍa gāgā

(||nevinna||)
mahi vĕṭrivām̐ḍu vĕṭri māna maṁdu tām̐ gŏnunā
vahi kĕkka maṁ dichcheḍi vaidyum̐ḍu mānubum̐ gāga
bahusaṁchalum̐ḍanu nā bhakti nībaim̐ bĕṭṭenā
mahimasedanu nīve marabuḍa gāgā

(||nevinna||)
dharalonam̐ bĕṭṭu jĕṭṭu tā nīru vosugŏnunā
bŏrim̐ bĕṁchevām̐ḍu nīru vosi pĕṁchum̐ gāga
niradi śhrīveṁkaḍeśha nene nannu boṣhiṁchenā
hari nīvu vuṭṭiṁchidi naḍu rakṣhiṁtu gāgā