నే నున్నదాన నని నీ విటు లోఁగక
(॥పల్లవి॥)
నే నున్నదాన నని నీ విటు లోఁగక
పూని యాపెనే పొగడుమీ విభుఁడా
(॥॥)
ఘనకుచగిరు లటు గదలఁగ వడిగా
వనిత నీ కెదురు వచ్చినదే
పెనఁగక నీ కాపె ప్రియములు చెప్పిన
చెనకి నీ వా పని సేయుమీ విభుఁడా
(॥॥)
దవ్వుల మొక్కులఁ దతిగొని మాటల
జవ్వని వలపులు చల్లినదే
రవ్వగఁ గౌఁగిట రతికిఁ దీసితే
నవ్వక కూడుమీ ననుపున విభుఁడా
(॥॥)
మంతన మెఱఁగక మఱి నినుఁ గూడుచు
కాంత పయ్య దటు గప్పినదే
యింతలో శ్రీ వేంకటేశ ననుఁ గూడితి
వంతయు నాపెనే అడుగుమీ విభుఁడా
(||pallavi||)
ne nunnadāna nani nī viḍu lom̐gaga
pūni yābĕne pŏgaḍumī vibhum̐ḍā
(||||)
ghanagusagiru laḍu gadalam̐ga vaḍigā
vanida nī kĕduru vachchinade
pĕnam̐gaga nī kābĕ priyamulu sĕppina
sĕnagi nī vā pani seyumī vibhum̐ḍā
(||||)
davvula mŏkkulam̐ dadigŏni māḍala
javvani valabulu sallinade
ravvagam̐ gaum̐giḍa radigim̐ dīside
navvaga kūḍumī nanubuna vibhum̐ḍā
(||||)
maṁtana mĕṟam̐gaga maṟi ninum̐ gūḍusu
kāṁta payya daḍu gappinade
yiṁtalo śhrī veṁkaḍeśha nanum̐ gūḍidi
vaṁtayu nābĕne aḍugumī vibhum̐ḍā