Ne nunna desa yemta nemdu danavedu kemta

నే నున్న దెస యెంత నేఁడు దనవేడు కెంత
Language

(॥పల్లవి॥)
నే నున్న దెస యెంత నేఁడు దనవేడు కెంత
పానిపట్టి యింతలో నే బాఁ తైతినా

(॥నే నున్న॥)
అలిగి నే నవ్వలి మోమై వూరకుండేదాని
నలరి పాదము లొత్తు మనీనె తాను
తలఁకి సిగ్గు వడఁడు తనకు నా కంత పొందా
మలసి తనచేఁతలు మరచెనా తాను

(॥నే నున్న॥)
చింతతోడ చెక్కు చేత సిగ్గువడి వున్నదాని
యింతలో నాకు మడిచి యిమ్మనీఁ దాను
మంతనా లాడఁగ వచ్చీ మంచి చుట్టమె నాకు
వింత దన కానోటనె వెళ్లెనా ప్రియము

(॥నేనున్న॥)
పట్టెమంచముపై నొంటిఁ బవ్వళించి వున్నదాని
అట్టె తా వచ్చితిని లెమ్మనీనె తాను
దిట్టయై శ్రీవెంకటాద్రిదేవుఁడు నన్నిటు గూడె
గుట్టునను గతి గూడుకొనెఁ గదె యిపుడు

(||pallavi||)
ne nunna dĕsa yĕṁta nem̐ḍu danaveḍu kĕṁta
pānibaṭṭi yiṁtalo ne bām̐ taidinā

(||ne nunna||)
aligi ne navvali momai vūraguṁḍedāni
nalari pādamu lŏttu manīnĕ tānu
talam̐ki siggu vaḍam̐ḍu tanagu nā kaṁta pŏṁdā
malasi tanasem̐talu marasĕnā tānu

(||ne nunna||)
siṁtadoḍa sĕkku seda sigguvaḍi vunnadāni
yiṁtalo nāgu maḍisi yimmanīm̐ dānu
maṁtanā lāḍam̐ga vachchī maṁchi suṭṭamĕ nāgu
viṁta dana kānoḍanĕ vĕḽlĕnā priyamu

(||nenunna||)
paṭṭĕmaṁchamubai nŏṁṭim̐ bavvaḽiṁchi vunnadāni
aṭṭĕ tā vachchidini lĕmmanīnĕ tānu
diṭṭayai śhrīvĕṁkaḍādridevum̐ḍu nanniḍu gūḍĕ
guṭṭunanu gadi gūḍugŏnĕm̐ gadĕ yibuḍu