నే నొకమాటాడితేను నీ వొకటాడేవేమే
(॥పల్లవి॥)
నే నొకమాటాడితేను నీ వొకటాడేవేమే
కానీలేరా నీవంటి కతలు నేరుతుమా
(॥నేనొ॥)
వెన్న దిన్న నోటనే వేఁడిపాలు దాగినట్టు
వెన్నెగా మాటాడి యేల వెంగెమాడేవే
వెన్నాఁ దింటివి వే డివేఁడిపాలుఁ జవిగొంటిఁ
విన్నిటా నీమోవి పొక్కె నిఁకనేల మాటలు
(॥నేనొ॥)
పువ్వు లందిచ్చినచేతఁ బూఁచి రాలందిచ్చినట్టు
జవ్వని కుచాల నొత్తి జగడాలేలే
పువ్వుల నందుకొంటివి పూఁచి, రాలూ నెత్తితివి
ఇవ్వల నీవొళ్లే చెప్పీ నిఁకనేల చేఁతలు
(॥నేనొ॥)
సూడిదెవట్టినవారి సొమ్ముల నించినయట్టు
వోడక కైదం డిచ్చితే నొత్తేవే గోర
సూడిదెగా నన్నుఁ గూడి సొమ్మూ నా కిచ్చితివి
యీడనే శ్రీవేంకటేశ యిఁకనేల పనులు
(||pallavi||)
ne nŏgamāḍāḍidenu nī vŏgaḍāḍeveme
kānīlerā nīvaṁṭi kadalu nerudumā
(||nenŏ||)
vĕnna dinna noḍane vem̐ḍibālu dāginaṭṭu
vĕnnĕgā māḍāḍi yela vĕṁgĕmāḍeve
vĕnnām̐ diṁṭivi ve ḍivem̐ḍibālum̐ javigŏṁṭim̐
vinniḍā nīmovi pŏkkĕ nim̐kanela māḍalu
(||nenŏ||)
puvvu laṁdichchinasedam̐ būm̐si rālaṁdichchinaṭṭu
javvani kusāla nŏtti jagaḍālele
puvvula naṁdugŏṁṭivi pūm̐si, rālū nĕttidivi
ivvala nīvŏḽle sĕppī nim̐kanela sem̐talu
(||nenŏ||)
sūḍidĕvaṭṭinavāri sŏmmula niṁchinayaṭṭu
voḍaga kaidaṁ ḍichchide nŏtteve gora
sūḍidĕgā nannum̐ gūḍi sŏmmū nā kichchidivi
yīḍane śhrīveṁkaḍeśha yim̐kanela panulu