నే నొకటి సేయఁగాను నీవొకటి సేయకువే
(॥పల్లవి॥)
నే నొకటి సేయఁగాను నీవొకటి సేయకువే
మానిని నీ చేఁతలకు మారుమలసెను
(॥నేనొ॥)
కన్నులకాటికెతోడ కసరకువే నా-
వెన్నెల మోమునవ్వుల విసరేను
కిన్నెరమీఁటుల గిలిగించకువే నా-
సన్నపు ధైర్యము వెదచల్లేను
(॥నేనొ॥)
చెరుసగముమాటలు పైఁ జిమ్మకువే! నీకు
యిరవైన మోవితేనే లిచ్చేను
సరసాల విరసాల సాదించకువే నా-
మెరవడివినయాల మెప్పించేను
(॥నేనొ॥)
పానుపుపై నన్నుఁ గూడి భ్రమయించకువే! కానఁ
గానే గోరఁ దారుకాణించేను
అని శ్రీ వేంకటేశుఁడు నలయించకువే
పూనిపటి నిన్ను నిట్టె బుజ్జగించేను
(||pallavi||)
ne nŏgaḍi seyam̐gānu nīvŏgaḍi seyaguve
mānini nī sem̐talagu mārumalasĕnu
(||nenŏ||)
kannulagāḍigĕdoḍa kasaraguve nā-
vĕnnĕla momunavvula visarenu
kinnĕramīm̐ṭula giligiṁchaguve nā-
sannabu dhairyamu vĕdasallenu
(||nenŏ||)
sĕrusagamumāḍalu paim̐ jimmaguve! nīgu
yiravaina movidene lichchenu
sarasāla virasāla sādiṁchaguve nā-
mĕravaḍivinayāla mĕppiṁchenu
(||nenŏ||)
pānububai nannum̐ gūḍi bhramayiṁchaguve! kānam̐
gāne goram̐ dārugāṇiṁchenu
ani śhrī veṁkaḍeśhum̐ḍu nalayiṁchaguve
pūnibaḍi ninnu niṭṭĕ bujjagiṁchenu