నే నొకటి సేయఁగాను నీ వొకటి సేసేవు
(॥పల్లవి॥)
నే నొకటి సేయఁగాను నీ వొకటి సేసేవు
కోనచెన్నరాయఁడ నీ గుణ మింక మానవు
(॥నే నొకటి॥)
పక్కన నే తోడ పకపక నగఁగాను
తెక్కుల నీ వైతే నేల తిట్ట వచ్చేవూ
మొక్కలము విడిచి నే ముచ్చట లాడుకోఁగాను
వెక్కసపువెంగె మని వేరె తలఁచేవూ
(॥నే నొకటి॥)
తనివోక నే నిన్ను తప్ప కిట్టె చూడఁగాను
తనవు చూచుక నీకే తల వంచేవు
అనుమానము లే దని ఆన నీపైఁ బెట్టఁగాను
పెనచి నీ వామాఁట పేరడిఁ బెట్టేవూ
(॥నే నొకటి॥)
కందువ లంటుచు నిన్ను కాఁగిట నించఁగాను
పొందుల నుప్పు వేసి పొత్తు గూడేవూ
అందపు శ్రీవెంకటేశ అట్టె కొనచెన్నఁడ వై
ముందు వెనకాఁ గూడి మోహము చల్లేవూ
(||pallavi||)
ne nŏgaḍi seyam̐gānu nī vŏgaḍi sesevu
konasĕnnarāyam̐ḍa nī guṇa miṁka mānavu
(||ne nŏgaḍi||)
pakkana ne toḍa pagabaga nagam̐gānu
tĕkkula nī vaide nela tiṭṭa vachchevū
mŏkkalamu viḍisi ne muchchaḍa lāḍugom̐gānu
vĕkkasabuvĕṁgĕ mani verĕ talam̐sevū
(||ne nŏgaḍi||)
tanivoga ne ninnu tappa kiṭṭĕ sūḍam̐gānu
tanavu sūsuga nīge tala vaṁchevu
anumānamu le dani āna nībaim̐ bĕṭṭam̐gānu
pĕnasi nī vāmām̐ṭa peraḍim̐ bĕṭṭevū
(||ne nŏgaḍi||)
kaṁduva laṁṭusu ninnu kām̐giḍa niṁcham̐gānu
pŏṁdula nuppu vesi pŏttu gūḍevū
aṁdabu śhrīvĕṁkaḍeśha aṭṭĕ kŏnasĕnnam̐ḍa vai
muṁdu vĕnagām̐ gūḍi mohamu sallevū