నే నొకటి సేయఁబోతే నేరుపు వేరొకటాయ
(॥పల్లవి॥)
నే నొకటి సేయఁబోతే నేరుపు వేరొకటాయ
నానెను వలపులెల్లా నాఁడెనాఁడే అయ్యా
(॥॥)
మొక్కఁబోఁగానేపో ముంచినపయ్యద జారె
గక్కన నీతోనవ్వఁగాఁ గారెఁ జెమట
వెక్కసాన మాటాడఁగా వేఁడినిట్టూర్పులు రేఁగె
యెక్కడిగొడవ మాఇంట నుండేనయ్యా
(॥॥)
దగ్గరి రాఁగాఁబో తనువెల్లాఁ బులకించె
సిగ్గువడఁగానేపొ చింతరేఁగెను
వొగ్గి విడె మియ్యఁగాఁబో వొడలెల్లాఁ గాఁక వుట్టె
యెగ్గుతప్పులకు నోప ఇంటనుండేనయ్యా
(॥॥)
కాఁగిలించఁగానేపొ కళదాఁకె మేనెల్లా
రాఁగుఁదమకానేపో రచ్చకెక్కెను
పాఁగిన శ్రీవేంకటేశ పైపైఁ గూడితి నిన్ను
యేఁగుఁబెండ్లితో మాయింట నుండేనయ్యా
(||pallavi||)
ne nŏgaḍi seyam̐bode nerubu verŏgaḍāya
nānĕnu valabulĕllā nām̐ḍĕnām̐ḍe ayyā
(||||)
mŏkkam̐bom̐gānebo muṁchinabayyada jārĕ
gakkana nīdonavvam̐gām̐ gārĕm̐ jĕmaḍa
vĕkkasāna māḍāḍam̐gā vem̐ḍiniṭṭūrbulu rem̐gĕ
yĕkkaḍigŏḍava māiṁṭa nuṁḍenayyā
(||||)
daggari rām̐gām̐bo tanuvĕllām̐ bulagiṁchĕ
sigguvaḍam̐gānebŏ siṁtarem̐gĕnu
vŏggi viḍĕ miyyam̐gām̐bo vŏḍalĕllām̐ gām̐ka vuṭṭĕ
yĕggudappulagu noba iṁṭanuṁḍenayyā
(||||)
kām̐giliṁcham̐gānebŏ kaḽadām̐kĕ menĕllā
rām̐gum̐damagānebo rachchagĕkkĕnu
pām̐gina śhrīveṁkaḍeśha paibaim̐ gūḍidi ninnu
yem̐gum̐bĕṁḍlido māyiṁṭa nuṁḍenayyā