నే నిట్టె కొసరితేను నీ వెఱిఁగేవా
(॥పల్లవి॥)
నే నిట్టె కొసరితేను నీ వెఱిఁగేవా
కానుకలు చూపనేల కమ్మటి బీరములు
(॥నేని॥)
చెంతలఁగూడేయప్పుడే చెప్పేఁగాక బుద్ది
పంతమాడనేల నీతో పలుమారును
మంతనమైనపుడే మహిమలు చూపేఁగాక
దొంతి వెట్టనేల నీతో తోడనే గర్వములు
(॥నేని॥)
వీడెమిచ్చేయప్పుడే వేడుక సేసేఁగాక
పాడివెట్టనేల నీతో బలిమిసేసి
యీడుజోడైనప్పుడేయెరుక సేసేఁగాక
కూడఁగట్టనేల నీతో గుంపెనసొలపులు
(॥నేని॥)
నవ్వేయిప్పుడే నిన్ను నంటున మెచ్చేఁగాక
రవ్వసేయనేల నిన్ను రచ్చలోనను
యివ్వల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
వువ్విళ్లూరించఁగలనేల వొక్కపరే యాసలు
(||pallavi||)
ne niṭṭĕ kŏsaridenu nī vĕṟim̐gevā
kānugalu sūbanela kammaḍi bīramulu
(||neni||)
sĕṁtalam̐gūḍeyappuḍe sĕppem̐gāga buddi
paṁtamāḍanela nīdo palumārunu
maṁtanamainabuḍe mahimalu sūbem̐gāga
dŏṁti vĕṭṭanela nīdo toḍane garvamulu
(||neni||)
vīḍĕmichcheyappuḍe veḍuga sesem̐gāga
pāḍivĕṭṭanela nīdo balimisesi
yīḍujoḍainappuḍeyĕruga sesem̐gāga
kūḍam̐gaṭṭanela nīdo guṁpĕnasŏlabulu
(||neni||)
navveyippuḍe ninnu naṁṭuna mĕchchem̐gāga
ravvaseyanela ninnu rachchalonanu
yivvala śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
vuvviḽlūriṁcham̐galanela vŏkkabare yāsalu