Ne nide nee vide negulele

నే నిదె నీ విదె నెగులేలే
Language

(॥పల్లవి॥)
నే నిదె నీ విదె నెగులేలే
నానాఁడే తగులాయ నవ్వు లింకా నేలే

(॥నేని॥)
అంగన నీ కరచేత నడఁగెను చందురుఁడు
యింగితాన నీ కింకానేలే చింత
పొంగేటి జలనిధులు పుడిసిటికి వచ్చెను
కొంగువట్టితీసితేనే కోప మింకా నేలే

(॥నేని॥)
పెంచెపుటాకసము నీపిడికిటిలోనిది
యెంచరానివెడదైన్యమేలే నీకు
చంచులకొండలు నీ సందిటిలోనే చిక్కె
వంచిన నీకెమ్మోవి వాడఁబారనేలే

(॥నేని॥)
కోరి మదనాస్త్రాలు కొనగోరిలోఁ జొచ్చె
యీరీతి నివ్వెరగులేలే నీకు
చేరితి శ్రీవేంకటపతిఁ జిక్కితి నీపాలిట
నారుకొనెఁ బులకలు నయగారా లేలే

(||pallavi||)
ne nidĕ nī vidĕ nĕgulele
nānām̐ḍe tagulāya navvu liṁkā nele

(||neni||)
aṁgana nī karaseda naḍam̐gĕnu saṁdurum̐ḍu
yiṁgidāna nī kiṁkānele siṁta
pŏṁgeḍi jalanidhulu puḍisiḍigi vachchĕnu
kŏṁguvaṭṭidīsidene koba miṁkā nele

(||neni||)
pĕṁchĕbuḍāgasamu nībiḍigiḍilonidi
yĕṁcharānivĕḍadainyamele nīgu
saṁchulagŏṁḍalu nī saṁdiḍilone sikkĕ
vaṁchina nīgĕmmovi vāḍam̐bāranele

(||neni||)
kori madanāstrālu kŏnagorilom̐ jŏchchĕ
yīrīdi nivvĕragulele nīgu
seridi śhrīveṁkaḍabadim̐ jikkidi nībāliḍa
nārugŏnĕm̐ bulagalu nayagārā lele