Ne nidamdu maadaadide neevu addaalu raanela

నే నితఁడు మాటాడితే నీవు అడ్డాలు రానేల
Language

(॥పల్లవి॥)
నే నితఁడు మాటాడితే నీవు అడ్డాలు రానేల
ఆనుక నీవే నాతో నటు సన్న సేసేవే

(॥నేని॥)
యేతులు నీకు గలితే యింటిలోం జేతువుగాక
కాతరించి యిందరిలో గర్వమేఁటికే
నీతులు నేరుచుకొంటే నీవే నడతువుగాక
పోతరించి నీవు మాకు బుద్దిచెప్పనేఁటికే

(॥నేని॥)
తనివితోడఁ జక్కనిదానవైతే నౌదుగాక
యెనలేనిమురిపెములు యీడనేఁటికే
యెనసి చుట్టమవైతే నెట్టయిన నౌతగాక
మొనసి మాకిటు నాయములు చెప్పనేంటికే

(॥నేని॥)
సేయ నోపికగలితే సేవలు సేతువుగాక
పాయపుమదముతోడి పంతమేఁటికే
యీయెడ శ్రీవేంకటేశుఁ డే నలమేలు మంగను
పాయక నన్నుఁగూడె నీపస చెప్పనేఁటికే

(||pallavi||)
ne nidam̐ḍu māḍāḍide nīvu aḍḍālu rānela
ānuga nīve nādo naḍu sanna seseve

(||neni||)
yedulu nīgu galide yiṁṭiloṁ jeduvugāga
kādariṁchi yiṁdarilo garvamem̐ṭige
nīdulu nerusugŏṁṭe nīve naḍaduvugāga
podariṁchi nīvu māgu buddisĕppanem̐ṭige

(||neni||)
tanividoḍam̐ jakkanidānavaide naudugāga
yĕnalenimuribĕmulu yīḍanem̐ṭige
yĕnasi suṭṭamavaide nĕṭṭayina naudagāga
mŏnasi māgiḍu nāyamulu sĕppaneṁṭige

(||neni||)
seya nobigagalide sevalu seduvugāga
pāyabumadamudoḍi paṁtamem̐ṭige
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelu maṁganu
pāyaga nannum̐gūḍĕ nībasa sĕppanem̐ṭige