Ne neṟumganaa vibhumda nee suddulu

నే నెఱుఁగనా విభుఁడ నీ సుద్దులు
Language

(॥పల్లవి॥)
నే నెఱుఁగనా విభుఁడ నీ సుద్దులు
నీ నయగారితనాల నెపాలు సేసేవు

(॥నేనెఱుఁగ॥)
ఆనవెట్టి న న్నెక్కించి అట్టే తూఁగుమంచ మూఁచి
ఆనడుమ నాపెతో మాటాడేవు నీవు
పూని యప్పటి నీవు పువ్వచెండున వేసి
మోనాన నంతలో నాపెమోవి యానితివి

(॥నేనెఱుఁగ॥)
చెక్కునొక్కి వేడుక నా చిక్కు దియ్యుచు
వుక్కునూఱ నీ వాపె వొడి వట్టేవు
వెక్కసాన నింటిలోన విందు నాకుఁ బెట్టించి
గక్కన నాపెను నీవు కౌఁగిలించేవు

(॥నేనెఱుఁగ॥)
పరగ నిద్రించు మని పచ్చడము గప్పి పెట్టి
సరవితో నేలితివి సంగడిదాని
యిరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
సరునే ఆపె దెచ్చి సంతసము సేసేవు

(||pallavi||)
ne nĕṟum̐ganā vibhum̐ḍa nī suddulu
nī nayagāridanāla nĕbālu sesevu

(||nenĕṟum̐ga||)
ānavĕṭṭi na nnĕkkiṁchi aṭṭe tūm̐gumaṁcha mūm̐si
ānaḍuma nābĕdo māḍāḍevu nīvu
pūni yappaḍi nīvu puvvasĕṁḍuna vesi
monāna naṁtalo nābĕmovi yānidivi

(||nenĕṟum̐ga||)
sĕkkunŏkki veḍuga nā sikku diyyusu
vukkunūṟa nī vābĕ vŏḍi vaṭṭevu
vĕkkasāna niṁṭilona viṁdu nāgum̐ bĕṭṭiṁchi
gakkana nābĕnu nīvu kaum̐giliṁchevu

(||nenĕṟum̐ga||)
paraga nidriṁchu mani pachchaḍamu gappi pĕṭṭi
saravido nelidivi saṁgaḍidāni
yiravai śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭe
sarune ābĕ dĕchchi saṁtasamu sesevu