Ne neṟimginave tolli nee suddulu

నే నెఱిఁగినవే తొల్లి నీ సుద్దులు
Language

(॥పల్లవి॥)
నే నెఱిఁగినవే తొల్లి నీ సుద్దులు
మానఁగదవయ్య నీ మతకము లెల్లను

(॥నేనె॥)
నీవున్న యిక్కు లెఱింగి నెలఁత యీడకే వచ్చే
సేవసేయ రమ్మని చెప్పెంపితివో
వోవల నీవప్పటిని వొట్టేల పెట్టుకోనేవు
దేవరపు గావా నీవు దిమ్మరితనానకు

(॥నేనె॥)
తప్పులేక నీవన్నట్టె తారుకాణమాట లాడె
వొప్పుగఁ బదరుకొంటివో తొలుతే
కప్పికప్పి నీవేల కడునొడఁబరచేవు
యెప్పుడు రాజవుగావా యీవిద్దెలకును

(॥నేనె॥)
నెక్కొని శ్రీవేంకటేశ నీవు నవ్వినట్టె నవ్వె
యెక్కడఁ గూడితిరో యింతకముందే
చెక్కులేల నొక్కేవు చిప్పిల నన్నిట్టె కూడి
గక్కనను గరువవుగావా యీయెమ్మలకు

(||pallavi||)
ne nĕṟim̐ginave tŏlli nī suddulu
mānam̐gadavayya nī madagamu lĕllanu

(||nenĕ||)
nīvunna yikku lĕṟiṁgi nĕlam̐ta yīḍage vachche
sevaseya rammani sĕppĕṁpidivo
vovala nīvappaḍini vŏṭṭela pĕṭṭugonevu
devarabu gāvā nīvu dimmaridanānagu

(||nenĕ||)
tappulega nīvannaṭṭĕ tārugāṇamāḍa lāḍĕ
vŏppugam̐ badarugŏṁṭivo tŏlude
kappigappi nīvela kaḍunŏḍam̐barasevu
yĕppuḍu rājavugāvā yīviddĕlagunu

(||nenĕ||)
nĕkkŏni śhrīveṁkaḍeśha nīvu navvinaṭṭĕ navvĕ
yĕkkaḍam̐ gūḍidiro yiṁtagamuṁde
sĕkkulela nŏkkevu sippila nanniṭṭĕ kūḍi
gakkananu garuvavugāvā yīyĕmmalagu