Ne neramganabudu naa neramu lemchamga vaddu

నే నెరఁగనపుడు నా నేరము లెంచఁగ వద్దు
Language

(॥పల్లవి॥)
నే నెరఁగనపుడు నా నేరము లెంచఁగ వద్దు
తానే నన్నింత సేయఁదగదో వోయమ్మా

(॥నేనెరఁ॥)
కన్నుల నిద్దురవచ్చీఁ గాఁకల నే బడలితి
యెన్నికనగవు లింకా నెంతదడవే
పన్నినతనయానలు పలుమారు నేఁ జెవుల
విన్నదానఁ గాను మీరే వినరోయమ్మా

(॥నేనెరఁ॥)
వూరకే నావొళ్లునొచ్చీ వుమ్మచెమటలునిండె
యీరీతిఁ దనమాట లెంతదడవే
భారమేల తా నన్నుఁబట్టి పెనఁగఁగ లోనై
వోరిచిన దానఁగాను వొగిఁ జూడరమ్మా

(॥నేనెరఁ॥)
నివ్వెరగు లివె ముంచె నిట్టూర్పు నిగుడెను
యివ్వలఁ దనవినయా లెంతదడవే
నవ్వుతా శ్రీవేంకటనాథుఁడిట్టె నన్నుఁగూడె
రవ్వ సేసేదానఁగాను రతికెక్కేనమ్మా

(||pallavi||)
ne nĕram̐ganabuḍu nā neramu lĕṁcham̐ga vaddu
tāne nanniṁta seyam̐dagado voyammā

(||nenĕram̐||)
kannula nidduravachchīm̐ gām̐kala ne baḍalidi
yĕnniganagavu liṁkā nĕṁtadaḍave
panninadanayānalu palumāru nem̐ jĕvula
vinnadānam̐ gānu mīre vinaroyammā

(||nenĕram̐||)
vūrage nāvŏḽlunŏchchī vummasĕmaḍaluniṁḍĕ
yīrīdim̐ danamāḍa lĕṁtadaḍave
bhāramela tā nannum̐baṭṭi pĕnam̐gam̐ga lonai
vorisina dānam̐gānu vŏgim̐ jūḍarammā

(||nenĕram̐||)
nivvĕragu livĕ muṁchĕ niṭṭūrbu niguḍĕnu
yivvalam̐ danavinayā lĕṁtadaḍave
navvudā śhrīveṁkaḍanāthum̐ḍiṭṭĕ nannum̐gūḍĕ
ravva sesedānam̐gānu radigĕkkenammā