Ne neṟamganaa yidi neevu seppavalenaa

నే నెఱఁగనా యిది నీవు చెప్పవలెనా
Language

(॥పల్లవి॥)
నే నెఱఁగనా యిది నీవు చెప్పవలెనా
తేనెలమాట లాడఁగ దేవరవు గావా

(॥నేనె ॥)
యిద్దరము నొక్కటే నీ వేమానినా నేమాయ
చద్దివేఁడిరతులలో సరసాలింతే
అద్దుక యేల లోఁగేవు ఆనలేల పెట్టేవు
తిద్దుక మాఁటలాడఁగ దేవరపు గావా

(॥నేనె॥)
నీవు నేను భేదమా నేర మిందులోన నేది
భావపుమందె మేళాలపలుకు లింతే
సేవలెల్ల సేసేవు చెక్కులేల నొక్కేవు
తీవరించి మాఁటలాడ దేవరవు గావా

(॥నేనె ॥)
మనకేలెగ్గలమేలుమంగను న న్నేలితివి
చలవులతిట్లెల్లా సలిగె లింతే
చెనకి యేల మొక్కేవు శ్రీవేంకటేశ్వర నీవు
దినము నీమాఁటలాడ దేవరపు గావా

(||pallavi||)
ne nĕṟam̐ganā yidi nīvu sĕppavalĕnā
tenĕlamāḍa lāḍam̐ga devaravu gāvā

(||nenĕ ||)
yiddaramu nŏkkaḍe nī vemāninā nemāya
saddivem̐ḍiradulalo sarasāliṁte
adduga yela lom̐gevu ānalela pĕṭṭevu
tidduga mām̐ṭalāḍam̐ga devarabu gāvā

(||nenĕ||)
nīvu nenu bhedamā nera miṁdulona nedi
bhāvabumaṁdĕ meḽālabalugu liṁte
sevalĕlla sesevu sĕkkulela nŏkkevu
tīvariṁchi mām̐ṭalāḍa devaravu gāvā

(||nenĕ ||)
managelĕggalamelumaṁganu na nnelidivi
salavuladiṭlĕllā saligĕ liṁte
sĕnagi yela mŏkkevu śhrīveṁkaḍeśhvara nīvu
dinamu nīmām̐ṭalāḍa devarabu gāvā