Ne nemtadidaananu neegemtigi lomganu

నే నెంతటిదానను నీకేఁటికి లోఁగను
Language

(॥పల్లవి॥)
నే నెంతటిదానను నీకేఁటికి లోఁగను
తానకమై యంత మొకదాకిరి సేసేవు

(॥నేనెం॥)
చెలులుగలవాఁడవు చెల్లును సరసమాడ
వలచివాఁడవు నవ్వఁగఁ జెల్లును
తలఁపుగలవాఁడవు తమకించాఁ జెల్లును
బలిమిం దార్కాణంచఁ బనియేమి నీకు

(॥నేనెం॥)
వేడుకగలవాఁడవు వినోదమాడఁగఁ జెల్లు
యీడైనవాఁడవు చనవియ్యఁ జెల్లును
వాడికైనవాఁడవు వద్దఁబెట్టుకోఁజెల్లు
పాడిచెప్పి నన్ను నొడఁబఱచ నేమిటికి

(॥నేనెం॥)
కరుణగలవాఁడవు కాంగిలించుకొనఁజెల్లు
యెరపులేనివాఁడవు యెనయఁజెల్లు
యిరవై శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
సరవిఁ గూడితి వెన్నిచనవు లిచ్చితివి

(||pallavi||)
ne nĕṁtaḍidānanu nīgem̐ṭigi lom̐ganu
tānagamai yaṁta mŏgadāgiri sesevu

(||nenĕṁ||)
sĕlulugalavām̐ḍavu sĕllunu sarasamāḍa
valasivām̐ḍavu navvam̐gam̐ jĕllunu
talam̐pugalavām̐ḍavu tamagiṁchām̐ jĕllunu
balimiṁ dārgāṇaṁcham̐ baniyemi nīgu

(||nenĕṁ||)
veḍugagalavām̐ḍavu vinodamāḍam̐gam̐ jĕllu
yīḍainavām̐ḍavu sanaviyyam̐ jĕllunu
vāḍigainavām̐ḍavu vaddam̐bĕṭṭugom̐jĕllu
pāḍisĕppi nannu nŏḍam̐baṟasa nemiḍigi

(||nenĕṁ||)
karuṇagalavām̐ḍavu kāṁgiliṁchugŏnam̐jĕllu
yĕrabulenivām̐ḍavu yĕnayam̐jĕllu
yiravai śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
saravim̐ gūḍidi vĕnnisanavu lichchidivi