Ne nemtadidaananu nee vinnidaa ghanumdavu

నే నెంతటిదానను నీ విన్నిటా ఘనుఁడవు
Language

(॥పల్లవి॥)
నే నెంతటిదానను నీ విన్నిటా ఘనుఁడవు
మోసముతో నిన్నుఁ జూచి మొక్కు టింతేకాక

(॥నేనెం॥)
అమరఁగ నాయకుఁడు ఆదరించితేఁ గాక
తమకించవచ్చునా తరుణులకు
మమకారమునఁ గొంత మన్నించితేఁగాక
సముకాన జింకించి సాదించవచ్చునా

(॥నేనెం॥)
మక్కువతో మగవాఁడు మాటలాడితేఁగాక
కక్కసించవచ్చునా కామినులకు
చక్కఁగా సిబ్బితివాపి చనవిచ్చితేఁగాక
పక్కనుండి పంతములు పచారించవచ్చునా

(॥నేనెం॥)
శ్రీ వేంకటేశ్వర నీవే చిత్తగించితేఁగాక
సోవలకే పెనఁగవచ్చునా మాకు
యీవేళ నన్నేలితివి యిటువలెనైతేఁగాక
దేవులనై కొంగువట్టి తెమలించవచ్చునా

(||pallavi||)
ne nĕṁtaḍidānanu nī vinniḍā ghanum̐ḍavu
mosamudo ninnum̐ jūsi mŏkku ṭiṁtegāga

(||nenĕṁ||)
amaram̐ga nāyagum̐ḍu ādariṁchidem̐ gāga
tamagiṁchavachchunā taruṇulagu
mamagāramunam̐ gŏṁta manniṁchidem̐gāga
samugāna jiṁkiṁchi sādiṁchavachchunā

(||nenĕṁ||)
makkuvado magavām̐ḍu māḍalāḍidem̐gāga
kakkasiṁchavachchunā kāminulagu
sakkam̐gā sibbidivābi sanavichchidem̐gāga
pakkanuṁḍi paṁtamulu pasāriṁchavachchunā

(||nenĕṁ||)
śhrī veṁkaḍeśhvara nīve sittagiṁchidem̐gāga
sovalage pĕnam̐gavachchunā māgu
yīveḽa nannelidivi yiḍuvalĕnaidem̐gāga
devulanai kŏṁguvaṭṭi tĕmaliṁchavachchunā