నే నెంతదానను నీవే యెక్కుడు గాక
(॥పల్లవి॥)
నే నెంతదానను నీవే యెక్కుడు గాక
పూని యెంత సంతోషింతు పూఁచి పట్టి నిన్నునూ
(॥॥)
మగువల నీవెంత మన్నించి యేలినాను
నెగడు లోకములోన నీ కీరితి
తగిలి నీవెంత పెద్దరికము సేసినాను
పొగడుదురు నిన్నునే పొలఁతు లిందరును
(॥॥)
వూడిగపు వారి నెట్టు వుపచరించి మెచ్చినా
తోడ నీ వుదారత్వమే దొడై వుండును
వేడుకతో నీ వెన్ని విధముల రక్షించినా
వాడికతో మెత్తురు నీ వాసివన్నె లెల్లాను
(॥॥)
నీవే గతి యనువారి నీ విట్టే మనిపినాను
భావించి చూడ నీ ప్రతాప మే నిండెను
వే వేలై యలమేల్మంగ విభుఁడ శ్రీవేంకటేశ
దైవమా యేలి తి దంతయును నీ సంప దే.
(||pallavi||)
ne nĕṁtadānanu nīve yĕkkuḍu gāga
pūni yĕṁta saṁtoṣhiṁtu pūm̐si paṭṭi ninnunū
(||||)
maguvala nīvĕṁta manniṁchi yelinānu
nĕgaḍu logamulona nī kīridi
tagili nīvĕṁta pĕddarigamu sesinānu
pŏgaḍuduru ninnune pŏlam̐tu liṁdarunu
(||||)
vūḍigabu vāri nĕṭṭu vubasariṁchi mĕchchinā
toḍa nī vudāratvame dŏḍai vuṁḍunu
veḍugado nī vĕnni vidhamula rakṣhiṁchinā
vāḍigado mĕtturu nī vāsivannĕ lĕllānu
(||||)
nīve gadi yanuvāri nī viṭṭe manibinānu
bhāviṁchi sūḍa nī pradāba me niṁḍĕnu
ve velai yalamelmaṁga vibhum̐ḍa śhrīveṁkaḍeśha
daivamā yeli ti daṁtayunu nī saṁpa de.