నే నెంత వోరుచుకొన్న నీ వెఱఁగవు
(॥పల్లవి॥)
నే నెంత వోరుచుకొన్న నీ వెఱఁగవు
కానీరా అందుకేమి కడఁబడెనా
(॥నేనెం॥)
చలపాదితనమా సారె పైఁబడవచ్చేవు
నిలుచుండఁగానే నానీడ దొక్కేవు
బలిమి వేరొకతైతే పంతమున నీచేఁతకు
తలవట్టి తీసి నోటఁదమ్మ వెట్టదా
(॥నేనెం॥)
గటు వాయతనమా కాలు మీఁద వేసేవు
గట్టినాచన్నుల చిప్పగతు లాడేవు
రట్టడియైనదైతే యిట్టె నిన్నుఁ జెప్పరాని
తిట్టు దిట్టి కళలంటి దిమ్ము రేఁచదా
(॥నేనెం॥)
కతకారితనమా కాలు మీఁద వేసేవు
రతిలో శ్రీవేంకటేశ రాయడించేవు
యితరులైతే నిన్ను యీచేఁతకు కొంగువట్టి
బతిమి నానలు వెట్టి పంతములు గొనదా
(||pallavi||)
ne nĕṁta vorusugŏnna nī vĕṟam̐gavu
kānīrā aṁdugemi kaḍam̐baḍĕnā
(||nenĕṁ||)
salabādidanamā sārĕ paim̐baḍavachchevu
nilusuṁḍam̐gāne nānīḍa dŏkkevu
balimi verŏgadaide paṁtamuna nīsem̐tagu
talavaṭṭi tīsi noḍam̐damma vĕṭṭadā
(||nenĕṁ||)
gaḍu vāyadanamā kālu mīm̐da vesevu
gaṭṭināsannula sippagadu lāḍevu
raṭṭaḍiyainadaide yiṭṭĕ ninnum̐ jĕpparāni
tiṭṭu diṭṭi kaḽalaṁṭi dimmu rem̐sadā
(||nenĕṁ||)
kadagāridanamā kālu mīm̐da vesevu
radilo śhrīveṁkaḍeśha rāyaḍiṁchevu
yidarulaide ninnu yīsem̐tagu kŏṁguvaṭṭi
badimi nānalu vĕṭṭi paṁtamulu gŏnadā