Ne nemta tamaginainaa neegu noruvaga podu

నే నెంత తమకినైనా నీకు నోరువక పోదు
Language

(॥పల్లవి॥)
నే నెంత తమకినైనా నీకు నోరువక పోదు
కానీవే తీగెకు కాయ కడు వేఁగై వుండునా

(॥నేనెం॥)
చన విచ్చితివి గాన సరసమాడితిఁ గాని
ననిచి దొరలతోడ నవ్వఁదగునా
నను మన్నింతువు గాన నమ్మి కడిగితిగాని
యెనసి యేనుగతోడ యేలాట మున్నదా

(॥నేనెం॥)
సమ్మతింతు వటుగాన సరుసఁ గూచుంటిఁగాని
యెమ్మె నీముందర జేసే దితవా నాకు
రమ్మని పిల్తువుగాన రాజసాన నుంటిగాని
తమ్మి సూర్యోదయమైతేఁ దలవంచఁ జెల్లునా

(॥నేనెం॥)
నీవే నే నందువుగాన నిన్ను నేఁ గూడితిఁగాని
దేవుఁడవు నిన్ను నంటఁదీరునా నాకు
శ్రీవేంకటుశుఁడవంటా సేవలు చేసితిఁగాని
తేవల మందెమేళమైతేఁ బ్రియాలు చెల్లునా

(||pallavi||)
ne nĕṁta tamaginainā nīgu noruvaga podu
kānīve tīgĕgu kāya kaḍu vem̐gai vuṁḍunā

(||nenĕṁ||)
sana vichchidivi gāna sarasamāḍidim̐ gāni
nanisi dŏraladoḍa navvam̐dagunā
nanu manniṁtuvu gāna nammi kaḍigidigāni
yĕnasi yenugadoḍa yelāḍa munnadā

(||nenĕṁ||)
sammadiṁtu vaḍugāna sarusam̐ gūsuṁṭim̐gāni
yĕmmĕ nīmuṁdara jese didavā nāgu
rammani pilduvugāna rājasāna nuṁṭigāni
tammi sūryodayamaidem̐ dalavaṁcham̐ jĕllunā

(||nenĕṁ||)
nīve ne naṁduvugāna ninnu nem̐ gūḍidim̐gāni
devum̐ḍavu ninnu naṁṭam̐dīrunā nāgu
śhrīveṁkaḍuśhum̐ḍavaṁṭā sevalu sesidim̐gāni
tevala maṁdĕmeḽamaidem̐ briyālu sĕllunā