నే నెంత తమకించినా నీ గుణము మేలు మేలు
(॥పల్లవి॥)
నే నెంత తమకించినా నీ గుణము మేలు మేలు
నానాగతి నలయవు నవ్వులే కాని
(॥॥)
వాసులకే పెనఁగితి వలపులు చల్లితి
వేసర వెంతైనా నీవు వీఁగి లోఁగవూ
ఆసలనే కొసరితి ఆయములు నంటితి
వీసమంతాఁ దలఁ కవు వేడుకే కాని
(॥॥)
చనవున సొలసితి జంకించి చూచితి
మనసు విఱుచుకోవు మానవు తమి
కనుసన్నల దూరితి కాఁకలు పైఁ బూసితి
అనుమానించ వేమిటా నాదరణే కాని
(॥॥)
కప్పురాన వేసితి కౌఁగిట బిగించితి
తప్పించుకొనవు మరి తడఁ బడవూ
ముప్పిరి శ్రీ వేంకటేశ మోవితేనె లానితి
చొప్పుమాయ లేమిటాను సొంపులే కాని
(||pallavi||)
ne nĕṁta tamagiṁchinā nī guṇamu melu melu
nānāgadi nalayavu navvule kāni
(||||)
vāsulage pĕnam̐gidi valabulu sallidi
vesara vĕṁtainā nīvu vīm̐gi lom̐gavū
āsalane kŏsaridi āyamulu naṁṭidi
vīsamaṁtām̐ dalam̐ kavu veḍuge kāni
(||||)
sanavuna sŏlasidi jaṁkiṁchi sūsidi
manasu viṟusugovu mānavu tami
kanusannala dūridi kām̐kalu paim̐ būsidi
anumāniṁcha vemiḍā nādaraṇe kāni
(||||)
kappurāna vesidi kaum̐giḍa bigiṁchidi
tappiṁchugŏnavu mari taḍam̐ baḍavū
muppiri śhrī veṁkaḍeśha movidenĕ lānidi
sŏppumāya lemiḍānu sŏṁpule kāni