నే నెంత చిన్ననైనా నీకే సులభము గాని
(॥పల్లవి॥)
నే నెంత చిన్ననైనా నీకే సులభము గాని
పూని నా సరివారికిఁ బొడవే సుమ్మీ
(॥నేనెంత॥)
యిచ్చకపుపతివి నీ వే మన్నా నితవే నాకు
కొచ్చి కొచ్చి తిట్టినాను కోప మున్నదా
తెచ్చుకొన్న నీసతులు తేనెల మాఁటాడినాను
మచ్చరములై పెరిగి మర్మములు నాఁటురా
(॥నే నెంత॥)
నీఁటున బ్రాణవిభుఁడ నీవేమి సేసినా
వాఁటమై మొక్కుదుఁ గాక వాసి వట్టెనా
నాఁటకపు సవతులు నయగారాలు సేసినా
యీఁటెల పోట్లే కాక యింత కోపేనా
(॥నే నెంత॥)
చేరి నన్ను నేలినట్టి శ్రీవెంకటేశ నీవు
యేరీతి నుండినాను యెర వున్నదా
సారెకు నీవు ముట్టినసవతులు వద్ద నున్నా
నీరసమె రేఁగుఁగాని యీయకోలు గాదురా
(||pallavi||)
ne nĕṁta sinnanainā nīge sulabhamu gāni
pūni nā sarivārigim̐ bŏḍave summī
(||nenĕṁta||)
yichchagabubadivi nī ve mannā nidave nāgu
kŏchchi kŏchchi tiṭṭinānu koba munnadā
tĕchchugŏnna nīsadulu tenĕla mām̐ṭāḍinānu
machcharamulai pĕrigi marmamulu nām̐ṭurā
(||ne nĕṁta||)
nīm̐ṭuna brāṇavibhum̐ḍa nīvemi sesinā
vām̐ṭamai mŏkkudum̐ gāga vāsi vaṭṭĕnā
nām̐ṭagabu savadulu nayagārālu sesinā
yīm̐ṭĕla poṭle kāga yiṁta kobenā
(||ne nĕṁta||)
seri nannu nelinaṭṭi śhrīvĕṁkaḍeśha nīvu
yerīdi nuṁḍinānu yĕra vunnadā
sārĕgu nīvu muṭṭinasavadulu vadda nunnā
nīrasamĕ rem̐gum̐gāni yīyagolu gādurā