నే నెంత నీచుఁడనైనా నీకుఁ బోవునా
(॥పల్లవి॥)
నే నెంత నీచుఁడనైనా నీకుఁ బోవునా
తానకమై నాలోనుండి తప్పించుకో వచ్చునా
(॥నేనెం॥)
సేసవెట్టి పెండ్లాడినచెలి యేరూపుది యైనా
వాసితోఁ బతికి విడువఁగ వచ్చునా
కాసుకుఁ గొచ్చినయట్టి కడుఁ బేదబంటు నైనా
వోసరించి వొకరికి నొప్పగించ వచ్చునా
(॥నేనెం॥)
చేరి తనవాకిలి గాచే శునకమున కైనా
వూర కాహారము వెట్టకుండ వచ్చునా
ఆరయఁ దాఁ గన్నబిడ్డ అంకె కెంత రాకుండినా
కూరిమి జేకొనక తాఁ గోపగించ వచ్చునా
(॥నేనెం॥)
పెంచినచిలుక యెంత పేరు కుచ్చి తిట్టినాను
ముంచి ముద్దాడుట గాక మొత్త వచ్చునా
నించి శ్రీవేంకటేశుఁడ నీ దాసులందు నేరమి
యించుక గలిగినా మన్నించకుండ వచ్చునా
(||pallavi||)
ne nĕṁta nīsum̐ḍanainā nīgum̐ bovunā
tānagamai nālonuṁḍi tappiṁchugo vachchunā
(||nenĕṁ||)
sesavĕṭṭi pĕṁḍlāḍinasĕli yerūbudi yainā
vāsidom̐ badigi viḍuvam̐ga vachchunā
kāsugum̐ gŏchchinayaṭṭi kaḍum̐ bedabaṁṭu nainā
vosariṁchi vŏgarigi nŏppagiṁcha vachchunā
(||nenĕṁ||)
seri tanavāgili gāse śhunagamuna kainā
vūra kāhāramu vĕṭṭaguṁḍa vachchunā
ārayam̐ dām̐ gannabiḍḍa aṁkĕ kĕṁta rāguṁḍinā
kūrimi jegŏnaga tām̐ gobagiṁcha vachchunā
(||nenĕṁ||)
pĕṁchinasiluga yĕṁta peru kuchchi tiṭṭinānu
muṁchi muddāḍuḍa gāga mŏtta vachchunā
niṁchi śhrīveṁkaḍeśhum̐ḍa nī dāsulaṁdu nerami
yiṁchuga galiginā manniṁchaguṁḍa vachchunā