నే నెంత నీ వెంత నిక్కెమా యిది
(॥పల్లవి॥)
నే నెంత నీ వెంత నిక్కెమా యిది
కానీ లేరా యిది యొక్కకాకు సేసేజాడలా
(॥నే నెంత॥)
కోరి వేఁడి తగిలినగోపసతు లుండఁగాను
ఆరయ నా కొంగు వట్టె వల సతినా
మేరతోఁ బెండ్లాడినరుక్మిణిదేవి వుండఁగాను
యేరా నాతో నవ్వేవు యెగక్కెమా
(॥నేనెంత॥)
చన విచ్చి మన్నించిన సత్యభామ వుండఁగాను
చెనకేవు నే నీకుఁ జిక్కితినా
పనివడి తెచ్చుకొన్పపదారువే లుండఁగాను
ననుఁ జెక్కు నొక్కేవు నాఁటకములా
(॥నే నెంత॥)
గంద మిచ్చి మెప్పించినకలికి యొకతె యుండ
అంది నన్నుఁ గాఁగిలించే వాగడములా
కందువ శ్రీవెంకటేశ కలసితి విటు నన్ను
చిందేవు మోహము నాపై చిత్త వింత వచ్చెనా
(||pallavi||)
ne nĕṁta nī vĕṁta nikkĕmā yidi
kānī lerā yidi yŏkkagāgu sesejāḍalā
(||ne nĕṁta||)
kori vem̐ḍi tagilinagobasadu luṁḍam̐gānu
āraya nā kŏṁgu vaṭṭĕ vala sadinā
meradom̐ bĕṁḍlāḍinarukmiṇidevi vuṁḍam̐gānu
yerā nādo navvevu yĕgakkĕmā
(||nenĕṁta||)
sana vichchi manniṁchina satyabhāma vuṁḍam̐gānu
sĕnagevu ne nīgum̐ jikkidinā
panivaḍi tĕchchugŏnpabadāruve luṁḍam̐gānu
nanum̐ jĕkku nŏkkevu nām̐ṭagamulā
(||ne nĕṁta||)
gaṁda michchi mĕppiṁchinagaligi yŏgadĕ yuṁḍa
aṁdi nannum̐ gām̐giliṁche vāgaḍamulā
kaṁduva śhrīvĕṁkaḍeśha kalasidi viḍu nannu
siṁdevu mohamu nābai sitta viṁta vachchĕnā