నే నెంత నీ వెంత నీతోనే బలిమా
(॥పల్లవి॥)
నే నెంత నీ వెంత నీతోనే బలిమా
మానరాని కృపతోడ మన్నించితి గాక
(॥నేనెంత॥)
చిత్తము వచ్చి నావద్ద చేరి వున్నాఁడవు గాక
వొత్తుకోలు వల పైతే వుండేవా నీవు
యెత్తిన కోపపుదాన నేమి బాఁతి నే నీకు
బత్తి సేసితివి నాభాగ్య మింతే కాక
(॥నే నెంత॥)
పిలిచితి విచ్చేసితి ప్రేమ గలుగఁగఁగాక
సొలసితేఁ బరులకు సులభుఁడవా
చెలులుల మీ కెంత లేదు చేరి నాతోనె మాట
పలు కాడే విదే నాభాగ్య మింతే కాక
(॥నేనెంత॥)
యిద్దరి మొక్కటి గాఁగ నిన్నియు నమరెఁ గాక
పొద్దు వోనిచోట చవి వుట్టీనా నీకు
గద్దరి శ్రీవెంకటేశ కాఁగిట నన్నుఁ గూడితి
బద్దు గాదు మెచ్చితి నాభాగ్య మింతే కాక
(||pallavi||)
ne nĕṁta nī vĕṁta nīdone balimā
mānarāni kṛpadoḍa manniṁchidi gāga
(||nenĕṁta||)
sittamu vachchi nāvadda seri vunnām̐ḍavu gāga
vŏttugolu vala paide vuṁḍevā nīvu
yĕttina kobabudāna nemi bām̐ti ne nīgu
batti sesidivi nābhāgya miṁte kāga
(||ne nĕṁta||)
pilisidi vichchesidi prema galugam̐gam̐gāga
sŏlasidem̐ barulagu sulabhum̐ḍavā
sĕlulula mī kĕṁta ledu seri nādonĕ māḍa
palu kāḍe vide nābhāgya miṁte kāga
(||nenĕṁta||)
yiddari mŏkkaḍi gām̐ga ninniyu namarĕm̐ gāga
pŏddu vonisoḍa savi vuṭṭīnā nīgu
gaddari śhrīvĕṁkaḍeśha kām̐giḍa nannum̐ gūḍidi
baddu gādu mĕchchidi nābhāgya miṁte kāga