Ne nemta mamchidanamu nerabinaam dana jaada

నే నెంత మంచితనము నెరపినాఁ దన జాడ
Language

(॥పల్లవి॥)
నే నెంత మంచితనము నెరపినాఁ దన జాడ
మానదుగా అందుకేమి మంచిదయ్యీఁ బదవే

(॥నేనెం॥)
నవ్వుచు నారమణుఁడె నావాఁడై వుండఁగాను
యెవ్వరికోపాలు మమ్ము నేమి సేసీని
యవ్వల నాతఁడు మాయింట నిట్టె వున్నాఁడంటా
దవ్వుల నే మాటాడినఁ దా మాటలాడదు

(॥నేనెం॥)
వొలసి యాతఁడే ముద్దుటుంగర మిచ్చివుండఁగా
వెలుపటఁ దా మేమన్నా వెరపయ్యీనా
చెలఁగి యిప్పుడు నా చేయి మీఁదయి వున్నదంటా
కొలఁది మీరిన తనకుచ్చిత ముడుగదు

(॥నేనెం॥)
కప్పి శ్రీ వేంకటేశుఁడు కాఁగిటిలో నుండఁగాను
వుప్పటించితేఁ దామే వుండ నీఁగదే
అప్పటి నెంత చెప్పినా ఆతఁడే నే నంటా
తప్పక వరుససిచ్చినాఁ దనివినే పొందదు

(||pallavi||)
ne nĕṁta maṁchidanamu nĕrabinām̐ dana jāḍa
mānadugā aṁdugemi maṁchidayyīm̐ badave

(||nenĕṁ||)
navvusu nāramaṇum̐ḍĕ nāvām̐ḍai vuṁḍam̐gānu
yĕvvarigobālu mammu nemi sesīni
yavvala nādam̐ḍu māyiṁṭa niṭṭĕ vunnām̐ḍaṁṭā
davvula ne māḍāḍinam̐ dā māḍalāḍadu

(||nenĕṁ||)
vŏlasi yādam̐ḍe mudduḍuṁgara michchivuṁḍam̐gā
vĕlubaḍam̐ dā memannā vĕrabayyīnā
sĕlam̐gi yippuḍu nā seyi mīm̐dayi vunnadaṁṭā
kŏlam̐di mīrina tanaguchchida muḍugadu

(||nenĕṁ||)
kappi śhrī veṁkaḍeśhum̐ḍu kām̐giḍilo nuṁḍam̐gānu
vuppaḍiṁchidem̐ dāme vuṁḍa nīm̐gade
appaḍi nĕṁta sĕppinā ādam̐ḍe ne naṁṭā
tappaga varusasichchinām̐ danivine pŏṁdadu