Ne nemi seyudunu ninnum bo vivegamu (?)

నే నేమి సేయుదును నిన్నుఁ బో వివేకము (?)
Language

(॥పల్లవి॥)
నే నేమి సేయుదును నిన్నుఁ బో వివేకము (?)
శ్రీనాథు మహిమలు చిమ్మి రేఁచఁగాను

(॥నేనే॥)
జీవుఁడేమి సేయును; చిత్తము వసముగాక
యీవల నావలఁ బరువెత్తఁ గాను
చేవల నాచిత్తమేమి సేయు; నందులోన నున్న-
శ్రీవల్లభభునిమాయ చిమ్మిరేఁచఁగాను

(॥నేనే॥)
దేహ మేమిసేయును; దేహము లోపల నున్న-
దాహపుటాసలు వెఱ్ఱి దవ్వఁగాను
యీహల నాయాసలును యేమిసేయు; నన్నిటికి
శ్రీహరి యానాజ్ఞ లిటు చిమ్మిరేఁచఁగాను

(॥నేనే॥)
పుట్టు గేమిసేయును; పురాకృతము వెంటఁ
గట్టిన బంధములై కలఁచఁగాను
గుట్టుతో శ్రీవేంకటేశుఁ గొలువఁగా నన్నతఁడు
మట్టువిూరఁ బదవిచ్చి మన్నించఁగాను

(||pallavi||)
ne nemi seyudunu ninnum̐ bo vivegamu (?)
śhrīnāthu mahimalu simmi rem̐sam̐gānu

(||nene||)
jīvum̐ḍemi seyunu; sittamu vasamugāga
yīvala nāvalam̐ baruvĕttam̐ gānu
sevala nāsittamemi seyu; naṁdulona nunna-
śhrīvallabhabhunimāya simmirem̐sam̐gānu

(||nene||)
deha memiseyunu; dehamu lobala nunna-
dāhabuḍāsalu vĕṭri davvam̐gānu
yīhala nāyāsalunu yemiseyu; nanniḍigi
śhrīhari yānājña liḍu simmirem̐sam̐gānu

(||nene||)
puṭṭu gemiseyunu; purākṛtamu vĕṁṭam̐
gaṭṭina baṁdhamulai kalam̐sam̐gānu
guṭṭudo śhrīveṁkaḍeśhum̐ gŏluvam̐gā nannadam̐ḍu
maṭṭuviూram̐ badavichchi manniṁcham̐gānu