నే నేమి సేతునే నిచ్చలాన నే నుందాన
(॥పల్లవి॥)
నే నేమి సేతునే నిచ్చలాన నే నుందాన
ఆనకపు తన సుద్దు లడుగరే మీరు
(॥నేనే॥)
చల్లనిచందురుఁడే సారె వేఁడి చల్లితేను
యెల్లవారి కిఁకమరి యేమిసేసేదే
వెల్లవిరి నానవ్వు వెంగెము తనకయితే
పల్లదాన తనకైనభాగ్య మింతేకాక
(॥నేనే॥)
ముడిచేటిపూవులే మొనలై నాఁటితేను
యెడయక యెల్లవారి కేది దెరువే
అడరి నాకనుచూపు లాయములు గాడితేను
బడి బడిఁ దాఁ జేసినభాగ్య మింతేకాక
(॥నేనే॥)
చక్కెరవంటిమాటలే సరిఁ జిరుచేఁదైతే
యెక్కడా దంపతులకు నిఁక నేఁటిదే
అక్కరై శ్రీవేంకటేశుఁ డలమేల్మంగను నేను
పక్కనఁ గూడితిఁ దనభాగ్య మింతేకాక
(||pallavi||)
ne nemi sedune nichchalāna ne nuṁdāna
ānagabu tana suddu laḍugare mīru
(||nene||)
sallanisaṁdurum̐ḍe sārĕ vem̐ḍi sallidenu
yĕllavāri kim̐kamari yemisesede
vĕllaviri nānavvu vĕṁgĕmu tanagayide
palladāna tanagainabhāgya miṁtegāga
(||nene||)
muḍiseḍibūvule mŏnalai nām̐ṭidenu
yĕḍayaga yĕllavāri kedi dĕruve
aḍari nāganusūbu lāyamulu gāḍidenu
baḍi baḍim̐ dām̐ jesinabhāgya miṁtegāga
(||nene||)
sakkĕravaṁṭimāḍale sarim̐ jirusem̐daide
yĕkkaḍā daṁpadulagu nim̐ka nem̐ṭide
akkarai śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
pakkanam̐ gūḍidim̐ danabhāgya miṁtegāga