నే నేమనే నీతో నీ చిత్త మింతే కాక
(॥పల్లవి॥)
నే నేమనే నీతో నీ చిత్త మింతే కాక
ఔనయ్య నిన్ను నౌఁగాదన నెంతదానను
(॥॥)
యెట్టి నేరుపరినైన యెంత నీవు మన్నించిన
నెట్టు కొని మాటలాడ నే నెంతదాన
చుట్టమ నే నెట్లైనా సులభుఁడవు నీ వైనా
నట్టనడిమికి వచ్చి నవ్వ నెంతదానను
(॥॥)
చక్కని దాన నైనాను జవ్వని నే నైనాను
నిక్కి నిన్ను నాఁటఁ జూడ నే నెంతదాన
అక్కర తో వలచినా నాసతో నే మెరసిన
మొక్కు టింతే కాక గోరు మోప నెంతదాననూ
(॥॥)
కడు జాణ నైనాను కౌఁగిట నీవు గూడిన
నిడివి సరసమాడ నే నెంతదాన
యెడయక శ్రీ వేంకటేశ నన్ను నేలితివి
కడలేక నిన్ను నేఁ బొగడ నెంతదాననూ
(||pallavi||)
ne nemane nīdo nī sitta miṁte kāga
aunayya ninnu naum̐gādana nĕṁtadānanu
(||||)
yĕṭṭi nerubarinaina yĕṁta nīvu manniṁchina
nĕṭṭu kŏni māḍalāḍa ne nĕṁtadāna
suṭṭama ne nĕṭlainā sulabhum̐ḍavu nī vainā
naṭṭanaḍimigi vachchi navva nĕṁtadānanu
(||||)
sakkani dāna nainānu javvani ne nainānu
nikki ninnu nām̐ṭam̐ jūḍa ne nĕṁtadāna
akkara to valasinā nāsado ne mĕrasina
mŏkku ṭiṁte kāga goru moba nĕṁtadānanū
(||||)
kaḍu jāṇa nainānu kaum̐giḍa nīvu gūḍina
niḍivi sarasamāḍa ne nĕṁtadāna
yĕḍayaga śhrī veṁkaḍeśha nannu nelidivi
kaḍalega ninnu nem̐ bŏgaḍa nĕṁtadānanū