నే నేమందునోయంటా నీ వనుమానించనేల
(॥పల్లవి॥)
నే నేమందునోయంటా నీ వనుమానించనేల
పూని అప్పణ ఇచ్చేను పొందవయ్య సతిని
(॥॥)
సరి పరపుపై నుండి సతి తెరవేసుక
పెరరేఁచీ వలపులు బెట్టి మాటాడి
యిరవిదె నీకు దండ కిట్టె విచ్చేయవయ్య
పరగఁ బాశుండితేను పట్టలేవు మనసు
(॥॥)
పుక్కిటివిడెముతోనే పొలఁతి మలగుపొంతి
కిక్కిరించీఁ దమకము కేరినవ్వుతా
అక్కరగలవు నీవు అట్టె కాఁగిలించవయ్య
అక్కున నిడుకో కిటు ఆఁపలేవు వయసు
(॥॥)
పచ్చడములోను చొచ్చి భామ కుచముల నొత్తి
యిచ్చకపుసన్న సేసి యెనసీ లోలో
కుచ్చి శ్రీ వేంకటేశ కూడితి విట్టె నన్ను
విచ్చనవిడి గాకుంటే విడువలే వాసను
(||pallavi||)
ne nemaṁdunoyaṁṭā nī vanumāniṁchanela
pūni appaṇa ichchenu pŏṁdavayya sadini
(||||)
sari parabubai nuṁḍi sadi tĕravesuga
pĕrarem̐sī valabulu bĕṭṭi māḍāḍi
yiravidĕ nīgu daṁḍa kiṭṭĕ vichcheyavayya
paragam̐ bāśhuṁḍidenu paṭṭalevu manasu
(||||)
pukkiḍiviḍĕmudone pŏlam̐ti malagubŏṁti
kikkiriṁchīm̐ damagamu kerinavvudā
akkaragalavu nīvu aṭṭĕ kām̐giliṁchavayya
akkuna niḍugo kiḍu ām̐palevu vayasu
(||||)
pachchaḍamulonu sŏchchi bhāma kusamula nŏtti
yichchagabusanna sesi yĕnasī lolo
kuchchi śhrī veṁkaḍeśha kūḍidi viṭṭĕ nannu
vichchanaviḍi gāguṁṭe viḍuvale vāsanu