నే నెగ్గులు వట్టనోప నీచిత్తమిఁకను
(॥పల్లవి॥)
నే నెగ్గులు వట్టనోప నీచిత్తమిఁకను
కానిమ్మని కైకొంటి కలదెల్లా మేలే
(॥నేనెగ్గు॥)
సారె సారె నవ్వఁగాను చప్ప ననేవు వలపు
వోరసేసు కూరకున్న వుప్పననేవు
నేరమి వట్టితే తననీడే తనకుఁ బగ
కూరిమి మాటలాడితే నూరెల్లాఁ జుట్టాలే
(॥నేనెగ్గు॥)
అగ్గలమై చూచితేను అనుకనేవు ననపు
సిగ్గులు వడితే నట్టే చిక్కననేవు
వెగ్గళించితేఁ దనవెంట్రుకలే వేఁకము
వొగ్గితేఁ బువ్వులు గంపెడొకరికిఁ జాలవు
(॥నేనెగ్గు॥)
తెక్కులఁ బుక్కిట నించితే నెఱ్ఱ ననేవు తమ్మ
పక్కన విడె మిచ్చితేఁ బచ్చననేవు
గక్కన శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
యెక్కితే యేనుఁగు గుజ్జు యెక్కకున్నఁ బొడవు
(||pallavi||)
ne nĕggulu vaṭṭanoba nīsittamim̐kanu
kānimmani kaigŏṁṭi kaladĕllā mele
(||nenĕggu||)
sārĕ sārĕ navvam̐gānu sappa nanevu valabu
vorasesu kūragunna vuppananevu
nerami vaṭṭide tananīḍe tanagum̐ baga
kūrimi māḍalāḍide nūrĕllām̐ juṭṭāle
(||nenĕggu||)
aggalamai sūsidenu anuganevu nanabu
siggulu vaḍide naṭṭe sikkananevu
vĕggaḽiṁchidem̐ danavĕṁṭrugale vem̐kamu
vŏggidem̐ buvvulu gaṁpĕḍŏgarigim̐ jālavu
(||nenĕggu||)
tĕkkulam̐ bukkiḍa niṁchide nĕṭra nanevu tamma
pakkana viḍĕ michchidem̐ bachchananevu
gakkana śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
yĕkkide yenum̐gu gujju yĕkkagunnam̐ bŏḍavu