నే నీకు వేరు గాను నీవు నా కెరవు గావు
(॥పల్లవి॥)
నే నీకు వేరు గాను నీవు నా కెరవు గావు
యే నెపమూ వేయ నీపై నింటికి రావయ్యా
(॥॥)
చెక్కునఁ బెట్టిన చేయి సేసవెట్టే నీ మీఁ ద
ముక్కుపైఁ బెట్టిన వేలు ముందే మెచ్చెను
వక్కణ లడుగనేల వలచితి నాఁ డే నీకు
యిక్కువలు చెప్పేగాని ఇంటికి రావయ్యా
(॥॥)
సిగ్గువడ్డ మొగమున సెలవి నవ్వులు రేఁగె
వెగ్గళించిన కన్నులే వేడుకఁ జూచె
కగ్గి నీతో నలుగను కడు ముద్దరాలను
యెగ్గు లేమీ నెంచను యింటికి రావయ్యా
(॥॥)
వాడిన కేమ్మోవిని వడిఁ దేనెలూరఁ జొచ్చె
వీడిన నెరులలోన విరులు నిండె
యీడనే శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
యీడుగాఁ గూడితి విఁక నింటికి రావయ్యా
(||pallavi||)
ne nīgu veru gānu nīvu nā kĕravu gāvu
ye nĕbamū veya nībai niṁṭigi rāvayyā
(||||)
sĕkkunam̐ bĕṭṭina seyi sesavĕṭṭe nī mīm̐ da
mukkubaim̐ bĕṭṭina velu muṁde mĕchchĕnu
vakkaṇa laḍuganela valasidi nām̐ ḍe nīgu
yikkuvalu sĕppegāni iṁṭigi rāvayyā
(||||)
sigguvaḍḍa mŏgamuna sĕlavi navvulu rem̐gĕ
vĕggaḽiṁchina kannule veḍugam̐ jūsĕ
kaggi nīdo naluganu kaḍu muddarālanu
yĕggu lemī nĕṁchanu yiṁṭigi rāvayyā
(||||)
vāḍina kemmovini vaḍim̐ denĕlūram̐ jŏchchĕ
vīḍina nĕrulalona virulu niṁḍĕ
yīḍane śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
yīḍugām̐ gūḍidi vim̐ka niṁṭigi rāvayyā