నే నెదుట నున్నదాన యీ చేఁతలూఁ జూచేఁగాక
(॥పల్లవి॥)
నే నెదుట నున్నదాన యీ చేఁతలూఁ జూచేఁగాక
వీనులారా నీ గుణాలు వినేఁగాని
(॥నేనె॥)
వంతువెట్టుక మగని వలపించవలెఁ గాక
పంతాలు సవతులతోఁ బలుకనేలే
యింతే కలితే నతని నీయింటికి రప్పించుకోవే
కాంతవు నీపగటెల్లాఁ గానవచ్చీఁ గాని
(॥నేనె॥)
సరుస నుండి యతని జట్టిగొ నవలెఁగాక
సరవారితోనేలే సాదిఁపులు
నెరవాదివైతేను మరుపుకోవలెఁగాక
తెరవ నీనేరు పెల్లాఁ దేటపడీఁ గాని
(॥నేనె॥)
ప్రేమ శ్రీవేంకటేశుతోఁ బెనగఁగవలెఁగాక
యేమిటికే తమికించ యేరాండ్లతో
మోము చూడవే ఇతనిమందై నన్ను నీతఁడేలె
లేమవు నీకోరికలు లెక్కకెక్కీఁ గాని
(||pallavi||)
ne nĕduḍa nunnadāna yī sem̐talūm̐ jūsem̐gāga
vīnulārā nī guṇālu vinem̐gāni
(||nenĕ||)
vaṁtuvĕṭṭuga magani valabiṁchavalĕm̐ gāga
paṁtālu savaduladom̐ baluganele
yiṁte kalide nadani nīyiṁṭigi rappiṁchugove
kāṁtavu nībagaḍĕllām̐ gānavachchīm̐ gāni
(||nenĕ||)
sarusa nuṁḍi yadani jaṭṭigŏ navalĕm̐gāga
saravāridonele sādim̐pulu
nĕravādivaidenu marubugovalĕm̐gāga
tĕrava nīneru pĕllām̐ deḍabaḍīm̐ gāni
(||nenĕ||)
prema śhrīveṁkaḍeśhudom̐ bĕnagam̐gavalĕm̐gāga
yemiḍige tamigiṁcha yerāṁḍlado
momu sūḍave idanimaṁdai nannu nīdam̐ḍelĕ
lemavu nīgorigalu lĕkkagĕkkīm̐ gāni