నే నే ప్రియము చెప్పే నేఁడిందుకు రమ్మనవే
(॥పల్లవి॥)
నే నే ప్రియము చెప్పే నేఁడిందుకు రమ్మనవే
తానే యెఱుఁగు నా తన సంది తగవు
(॥॥)
ఆఁటది యైన దానికి అణఁకువ వలెఁ గాక
యీటు లేని మగవాని కేలే యిది
గాఁటమైన వినయమూఁ గాంతకే వలెఁ గాక
మాటులేని నాయకుఁడు మరి కడమ లేలే
(॥॥)
వనితయైన దానికి వంచనము వలెఁగాక
ఘనుఁడైన వాని కేలే కమ్మటినిది
పెనఁగుచుఁ గామినికి పిలువఁగవలెఁ గాక
యెనలేని పంతగాఁడు యిఁక నేలే తనకు
(॥॥)
దేవులైన దానికి వొద్దిక మొక్కవలెఁ గాక
శ్రీ వేంకటేశ్వరు కేలే సిగ్గుతో నిది
కైవసమై అలమేల్మంగను తానే నన్నుఁగూడె
చేవ మీరినట్టి జాణ చెప్ప నేలే తనకూ.
(||pallavi||)
ne ne priyamu sĕppe nem̐ḍiṁdugu rammanave
tāne yĕṟum̐gu nā tana saṁdi tagavu
(||||)
ām̐ṭadi yaina dānigi aṇam̐kuva valĕm̐ gāga
yīḍu leni magavāni kele yidi
gām̐ṭamaina vinayamūm̐ gāṁtage valĕm̐ gāga
māḍuleni nāyagum̐ḍu mari kaḍama lele
(||||)
vanidayaina dānigi vaṁchanamu valĕm̐gāga
ghanum̐ḍaina vāni kele kammaḍinidi
pĕnam̐gusum̐ gāminigi piluvam̐gavalĕm̐ gāga
yĕnaleni paṁtagām̐ḍu yim̐ka nele tanagu
(||||)
devulaina dānigi vŏddiga mŏkkavalĕm̐ gāga
śhrī veṁkaḍeśhvaru kele siggudo nidi
kaivasamai alamelmaṁganu tāne nannum̐gūḍĕ
seva mīrinaṭṭi jāṇa sĕppa nele tanagū.