నే నే మని విన్నవించే నీ మంచితనమునకు
(॥పల్లవి॥)
నే నే మని విన్నవించే నీ మంచితనమునకు
ఆనుకొన్న నాలోని అలయిక దేర్తువూ
(॥॥)
నీ మనసు దెలియక నేఁ గూరిమి గొసరితే
నా మొగము చూచి నీవు నవ్వుదువూ
ఆముకొన్న తమకము లటు నీకుఁ జూపితేను
ప్రేమ మెఱిఁగి నాతో గాఁపురము సేతువూ
(॥॥)
నీడ నుండి చెమటతో నిన్నుదప్పక చూచితే
వేడుక మిగుల నన్ను వేఁడుకొందువు
వోడక నీపై బత్తిని వొడివట్టి తీసితేను
కూడ వచ్చి పానుపు పైఁ గూచుండుదువు
(॥॥)
అక్కర గలిగి నీపై నాసల నే నుండితేను
గక్కన నందుకు నీవు కౌఁగిలింతువు
యిక్కువ శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
మక్కువ న న్నేలితివి మరియు మన్నింతువు.
(||pallavi||)
ne ne mani vinnaviṁche nī maṁchidanamunagu
ānugŏnna nāloni alayiga derduvū
(||||)
nī manasu dĕliyaga nem̐ gūrimi gŏsaride
nā mŏgamu sūsi nīvu navvuduvū
āmugŏnna tamagamu laḍu nīgum̐ jūbidenu
prema mĕṟim̐gi nādo gām̐puramu seduvū
(||||)
nīḍa nuṁḍi sĕmaḍado ninnudappaga sūside
veḍuga migula nannu vem̐ḍugŏṁduvu
voḍaga nībai battini vŏḍivaṭṭi tīsidenu
kūḍa vachchi pānubu paim̐ gūsuṁḍuduvu
(||||)
akkara galigi nībai nāsala ne nuṁḍidenu
gakkana naṁdugu nīvu kaum̐giliṁtuvu
yikkuva śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
makkuva na nnelidivi mariyu manniṁtuvu.