Ne nannidaam groorumda neeve gadigaa vachchidi

నే నన్నిటాఁ గ్రూరుఁడ నీవే గతిగా వచ్చితి
Language

(॥పల్లవి॥)
నే నన్నిటాఁ గ్రూరుఁడ నీవే గతిగా వచ్చితి
మానక నన్నేలుకొని మన్నించవలెను

(॥నేన॥)
నేరమి సేసినవాఁడు నెమ్మి యింటికి వచ్చితే
మారుకొన కన్నియును మఱవవలె
కారులు వల్కినవాఁడు గక్కునఁ బంత మిచ్చితే
నేరుపుల నేస్తములే నెరపఁగవలెను

(॥నేన॥)
పగవాఁడైనవాఁడు బంట నని మొక్కితే
సొగిసి లోఁ గొని కృపఁ జూడవలెను
వెగటున నాన దోసి వెఱపుమాలినవాఁడు
అగపడి యాజ్ఞ వెట్టు మంటే మానవలెను

(॥నేను॥)
ధన మెత్తుకొన్నవాఁడు తానే వచ్చి పనివేళ
ననిమొన నిల్చితేఁ జేకొనవలెను
వనరి యజ్ఞానపువాఁడ నిన్ను నుతించితి
ఘనుఁడ శ్రీ వేంకటేశ కావవలె నన్నును

(||pallavi||)
ne nanniḍām̐ grūrum̐ḍa nīve gadigā vachchidi
mānaga nannelugŏni manniṁchavalĕnu

(||nena||)
nerami sesinavām̐ḍu nĕmmi yiṁṭigi vachchide
mārugŏna kanniyunu maṟavavalĕ
kārulu valginavām̐ḍu gakkunam̐ baṁta michchide
nerubula nestamule nĕrabam̐gavalĕnu

(||nena||)
pagavām̐ḍainavām̐ḍu baṁṭa nani mŏkkide
sŏgisi lom̐ gŏni kṛpam̐ jūḍavalĕnu
vĕgaḍuna nāna dosi vĕṟabumālinavām̐ḍu
agabaḍi yājña vĕṭṭu maṁṭe mānavalĕnu

(||nenu||)
dhana mĕttugŏnnavām̐ḍu tāne vachchi paniveḽa
nanimŏna nilsidem̐ jegŏnavalĕnu
vanari yajñānabuvām̐ḍa ninnu nudiṁchidi
ghanum̐ḍa śhrī veṁkaḍeśha kāvavalĕ nannunu