నే ననఁగా నెంతవాఁడ నెయ్యపుజీవులలోన
(॥పల్లవి॥)
నే ననఁగా నెంతవాఁడ నెయ్యపుజీవులలోన
యీ నెపాన రక్షించీ నీశ్వరుఁడే కాక
(॥నేన॥)
యెవ్వరు బుద్ధిచెప్పిరి యిలపైఁ జీమలకెల్లా
నెవ్వగఁ బుట్టల గొల్చు నించుకొమ్మని
అవ్వల సంసారభ్రాంతి అనాదినుండియు లోలోఁ
దవ్వించి తలకెత్తే యంతర్యామేకాక
(॥నేన॥)
చెట్టుల కెవ్వరు బుద్ధిచేప్పేరు తతికాలానఁ
బుట్టి కాచి పూచి నిండాఁ బొదలుమని
గుట్టుతో జైతన్యమై గుణములన్నిటికిని
తిట్టపెట్టి రచించిన దేవుఁ డింతేకాక
(॥నేన॥)
బుద్దు లెవ్వరు చెప్పిరి పుట్టినట్టి మెకాలకు
తిద్ది చన్నుదాగి పూరి దినుమని
పొద్దువొద్దులోన నుండి భోగములు మఱపిన-
నిద్దపు శ్రీవేంకటాద్రినిలయుండే కాక
(||pallavi||)
ne nanam̐gā nĕṁtavām̐ḍa nĕyyabujīvulalona
yī nĕbāna rakṣhiṁchī nīśhvarum̐ḍe kāga
(||nena||)
yĕvvaru buddhisĕppiri yilabaim̐ jīmalagĕllā
nĕvvagam̐ buṭṭala gŏlsu niṁchugŏmmani
avvala saṁsārabhrāṁti anādinuṁḍiyu lolom̐
davviṁchi talagĕtte yaṁtaryāmegāga
(||nena||)
sĕṭṭula kĕvvaru buddhisepperu tadigālānam̐
buṭṭi kāsi pūsi niṁḍām̐ bŏdalumani
guṭṭudo jaidanyamai guṇamulanniḍigini
tiṭṭabĕṭṭi rasiṁchina devum̐ ḍiṁtegāga
(||nena||)
buddu lĕvvaru sĕppiri puṭṭinaṭṭi mĕgālagu
tiddi sannudāgi pūri dinumani
pŏdduvŏddulona nuṁḍi bhogamulu maṟabina-
niddabu śhrīveṁkaḍādrinilayuṁḍe kāga