Ne nanamgaa nemtadaana neegum dolle valasidi

నే ననఁగా నెంతదాన నీకుఁ దొల్లె వలచితి
Language

(॥పల్లవి॥)
నే ననఁగా నెంతదాన నీకుఁ దొల్లె వలచితి
దానికేమి రక్షించఁగఁ దగ నీకే భారము

(॥॥)
యిమ్ముల నేమీ నేరని యెట్టి ముద్దరాలై నా
కమ్మి నీతో మాటాడితే కలికి యౌను
పమ్మి యప్పటి నెంతటి పంతగత్తె యైనాను
తెమ్మగా నీతో మాటాడితే నేలో నౌను

(॥॥)
చెలరేఁగి యెటువంటి సిగ్గరిది యైనాను
నలి నీ యెదుట నుంటే నవ్వులాఁడౌను
మలసి గుణము గల మానాపతి యైనాను
కలసి నిన్నుఁగూడితే గయ్యాళి యౌను

(॥॥)
యెన్ని చందముల మరి యేమీ నేరని దైనాను
నన్న లా చాయల నాడే జాణకత్తౌను
యిన్నిటా శ్రీ వేంకటేశ యేనమేలుమంగను
మన్నించి నన్నేలితివి మంచి తనమౌను

(||pallavi||)
ne nanam̐gā nĕṁtadāna nīgum̐ dŏllĕ valasidi
dānigemi rakṣhiṁcham̐gam̐ daga nīge bhāramu

(||||)
yimmula nemī nerani yĕṭṭi muddarālai nā
kammi nīdo māḍāḍide kaligi yaunu
pammi yappaḍi nĕṁtaḍi paṁtagattĕ yainānu
tĕmmagā nīdo māḍāḍide nelo naunu

(||||)
sĕlarem̐gi yĕḍuvaṁṭi siggaridi yainānu
nali nī yĕduḍa nuṁṭe navvulām̐ḍaunu
malasi guṇamu gala mānābadi yainānu
kalasi ninnum̐gūḍide gayyāḽi yaunu

(||||)
yĕnni saṁdamula mari yemī nerani dainānu
nanna lā sāyala nāḍe jāṇagattaunu
yinniḍā śhrī veṁkaḍeśha yenamelumaṁganu
manniṁchi nannelidivi maṁchi tanamaunu